Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. దీపావళీ పండగ సందర్భంగా ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇక శివ రజనీకాంత్ (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. పెద్దన్న తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.8 కోట్ల రేంజ్ లో మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుంది అనుకుంటే.. 1.6 కోట్ల షేర్ మార్క్‌ను అందుకుని నిరాశ పరిచింది. పెద్దన్న రెండో రోజు 63 లక్షల రేంజ్లో షేర్ వసూలు చేసి తుస్సుమంది. ఇక ముడో రోజు రెండు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్లో వచ్చింది. ఇలా కలెక్షన్స్ వస్తే.. బ్రేక్ ఈవెన్ కష్టం అని, చూస్తుంటే సినిమా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
పెద్దన్న మూడో రోజు కలెక్షన్స్…
Nizam: 16L
Ceeded: 8L
UA: 4L
East: 3L
West: 2L
Guntur: 3L
Krishna: 3L
Nellore: 2L
AP-TG Total:- 0.41CR(0.68CR~ Gross)
మూడు రోజుల్లో మొత్తం కలెక్షన్స్..
Nizam: 95L
Ceeded: 44L
UA: 27L
East: 19L
West: 14L
Guntur: 32L
Krishna: 18L
Nellore: 15L
AP-TG Total:- 2.64CR(4.2CR~ Gross)
ఈ సినిమా 12.5 కోట్ల బిజినెస్ చేయగా.. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక పెద్దన్న మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 10 కోట్లకుపైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Akash Puri Romantic Collections : రొమాంటిక్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..
ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddhanna, Rajinikanth, Tollywood news