హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth | Peddhanna Collections: రజనీకాంత్ పెద్దన్న మొదటి రోజు కలెక్షన్స్.. ఇది దారుణం...

Rajinikanth | Peddhanna Collections: రజనీకాంత్ పెద్దన్న మొదటి రోజు కలెక్షన్స్.. ఇది దారుణం...

Pedhanna Collections Photo : Twitter

Pedhanna Collections Photo : Twitter

Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. దీపావళీ పండగ సందర్భంగా  ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Rajinikanth - Peddhanna : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. దీపావళీ పండగ సందర్భంగా  ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇక శివ రజనీకాంత్  (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. ముఖ్యంగా తెలుగులో మొదటి రోజు అనుకోని రీతిలో కలెక్షన్స్ వచ్చాయి.

పెద్దన్న తెలుగు రాష్ట్రాల్లో దీపావళి హాలిడే రోజున మిగిలిన సినిమాల కన్నా కూడా భారీగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా 1.8 కోట్ల రేంజ్ లో మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుంది అనుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్దన్న మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల షేర్ మార్క్‌ను అందుకుని నిరాశ పరిచింది.

ఏరియాల వారిగా మొదటిరోజు కలెక్షన్స్ చూస్తే…

Nizam: 53L

Ceeded: 24L

UA: 16L

East: 12L

West: 9L

Guntur: 25L(14L Hires)

Krishna: 11L

Nellore: 10L

AP-TG Total:- 1.60CR(2.45CR~ Gross)

ఈ సినిమా 12.5 కోట్ల బిజినెస్ చేయగా.. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక పెద్దన్న మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 11.4 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Priyamani: నటి ప్రియమణి భర్త ఎవరు.. ఎలా ఉంటారో తెలుసా...

ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది.

తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.  గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

Acharya | Ram Charan : మణిశర్మ నుంచి మరో మంచి మెలోడీ... అదిరిన నీలాంబరి సాంగ్...

ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

First published:

Tags: Rajinikanth, Tollywood news

ఉత్తమ కథలు