
Twitter
రజినీకాంత్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన కాప్ యాక్షన్ ఫిల్మ్ దర్బార్.
రజినీకాంత్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన కాప్ యాక్షన్ ఫిల్మ్ దర్బార్. ఈ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే రజనీ గత సినిమాలు ఇటు తెలుగులోని కానీ అటూ తమిళ్లో కానీ అనుకున్నవిధంగా అలరించలేదు. దీంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. దర్బార్‌లో రజనీకాంత్ బ్యాడ్ పోలీసు అధికారిగా నటించాడు. నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు రజనీకాంత్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భాగానే అలరిస్తోంది. కాగా ఈ చిత్రం విడుదల అయిన రోజే పైరసీ రూపంలో కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చింది. సినిమా పర్లేదు అనుకుంటున్న సమయంలో ఈ పైరసీ సినిమాకు పెనుసవాల్‌గా మారింది. అయితే ఈ విషయంలో రజిని అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైందో లేదో అప్పుడే వెబ్‌సైట్స్‌లో రావడం పట్ల మండిపడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో డౌన్ లోడ్స్ జరిగిపోయాయి. సోషల్ మీడియాలో సినిమా క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చిత్రాన్ని పైరసీ సైట్ల నుండి తొలగించాలని సైబర్ పోలీసుల్ని కోరుతున్నారు. కాగా పాన్ ఇండియా మూవీ తరహాలో భారీగా విడుదల అయిన ఈ సినిమా మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం వుంది. దర్బార్‌లో రజనీకి జోడిగా మరోసారి నయనతార నటించగా... నివేతా థామస్ కూతురి పాత్రలో ఇరగదీసింది. హీందీ నటుడు సునీల్ శెట్టి కీలక మరో పాత్రలో అదరగొట్టాడు.
అందాలతో కేక పెట్టిస్తోన్న శ్రీముఖి..
Published by:Suresh Rachamalla
First published:January 10, 2020, 17:17 IST