రజినీకాంత్, మురుగదాస్ ‘దర్బార్’ షూటింగ్ కంప్లీట్.. గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్..

తాజాగా ‘దర్బార్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో  ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్  అఫీషియల్‌గా ప్రకటించింది. 

news18-telugu
Updated: October 4, 2019, 2:54 PM IST
రజినీకాంత్, మురుగదాస్ ‘దర్బార్’ షూటింగ్ కంప్లీట్.. గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్..
ఏ.ఆర్.మురుగదాస్, రజినీకాంత్ ‘దర్బార్ (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. ఆ తర్వాత  ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో రజినీకాంత్  దాదాపు ఇరవై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..‘దర్బార్’లో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో రజినీకాంత్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించాడు.  ఇప్పటికే ముంబాయిలో ఈసినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారు. తాజాగా ‘దర్బార్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో  ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్  అఫీషియల్‌గా ప్రకటించింది.లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రజినీకాంత్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 4, 2019, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading