• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJINIKANTH MOHAN BABU RESPOND ON RAJINIKANTH QUIT POLITICAL AND HEALTH CONDITIONS TA

Rajinikanth-Mohan Babu: రజినీకాంత్ నిర్ణయంపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth-Mohan Babu: రజినీకాంత్ నిర్ణయంపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth-Mohan Babu: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడంపై రజినీకాంత్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఐతే.. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.

Rajinikanth-Mohan Babu: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడంపై రజినీకాంత్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఐతే.. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.

  • Share this:
    Rajinikanth-Mohan Babu: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడంపై రజినీకాంత్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఐతే.. తలైవా ఎంట్రీ... ఎగ్జిట్ అంతా సినిమాటిగ్‌గా జరిగింది. అంతేకాదు తమిళ తలైవా గత పాతికేళ్లుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. అంతేకాదు డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. దీంతో రజినీకాంత్ అభిమానులు లుండీ డాన్స్ ‌తో ఊగిపోయారు. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకున్న రజినీకాంత్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తన రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటంచి మరోసారి సంచలనం సృష్టించారు. ఐతే.. రజినీకాంత్ రాజకీయ అస్త్ర సన్యాసం వెనక పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    ఆరోగ్యం సహకరించకపోవడం సహా ఎన్నో కారణాలున్నాయి. ప్రస్తుతం ఈయన వయసు 70 యేళ్లు. రాజకీయాలంటే ప్రజల్లోకి వెళ్లాలి. అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలను తరుచుగా కలుస్తూ ఉండాలి. స్వతహాగా కర్ణాటకు చెందిన రజినీకాంత్ రేపొద్దున కావేరి జలాల విషయంలో అటు పుట్టిన కర్ణాటకకు, తనకు సినిమా నటుడి ఆరాధిస్తోన్న తమిళనాడు ప్రజల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. ఆ ఇష్యూలో నలిగిపోవడం ఇష్టం లేకపోవడమా అనే కారణం కూడా వినిపిస్తోంది.మరోవైపు తన మిత్రుడు కమల్ హాసన్ పార్టీ వల్ల తన ఓటు బ్యాంకుకు ఏమైనా గండిపడే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వచ్చాయట. అంతేకాక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లాగే తమిళనాడులో తన పార్టీ కూడా కొన్ని సీట్లకే పరిమితం అవుతుందనే ఆలోచనలతో రజనీకాంత్‌కు రక్తపోటు పెరిగి ఆసుపత్రి పాలైనట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

    సూపర్ స్టార్ రజినీకాంత్ (file/Photo)


    తన రాజకీయ ప్రవేశం చేస్తే ప్రత్యర్థులపై ఎన్నో విషయాల్లో విరుచుకుపడాలి. ఇన్ని చిక్కుల మధ్య పార్టీ పెట్టడం కంటే పెట్టకపోవడం ఉత్తమం అనే నిర్ణయానికి రజినీకాంత్ వచ్చినట్టు సమాచారం. ఐతే.. రజినీకాంత్ రాజకీయాల్లోంచి పక్కకు తప్పుకోవడంపై ఆయన అత్యంత ఆప్త మిత్రుడు మోహన్ బాబు స్పందించారు.

    సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మంచి అనుబంధమే ఉంది. గత 40 ఏళ్లకు పైగా వీరి స్నేహం అలాగే కొనసాగుతూ వస్తోంది.  ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య అంతే చనువు ఉంది. ఆ చనువుతోనేే తన సూపర్ స్టార్ అన్న ఇమేజ్ పక్కనపెట్టి.. మోహన్ బాబు పెదరాయుడులో రజినీకాంత్ గెస్ట్ రోల్లో నటించారు. తాజాగా తన మిత్రుడు రాజకీయాల నుంచి తప్పకోవడంపై మోహన్ బాబు స్పందించారు. రజీనీకాంత్ తనకు అత్యంత ఆప్తుడన్న సంగతి తెలిసిందే కదా. ఒక రకంగా తను రాజకీయాల్లో రాకపోవడంపై నాతో పాటు అభిమానులకు పెద్ద షాకే అయినా.. ఆయన ఆరోగ్య రీత్యా తను (రజినీకాంత్) రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదనే నమ్ముతున్నాను.

    rajinikanth mohan babu,rajinikanth mohan babu called wife latha,mohan babu called latha rajinikanth,rajinikanth in hospital,rajinikanth hospitalised,rajinikanth admit hospital,rajinikanth admitted apollo hospital,superstar rajinikanth hospitalised,rajinikanth admitted in hospital,rajnikanth in us hospital,rajinikanth hospitalised in hyderabad,superstar rajinikanth admits hyderabad apollo hospital,రజినీకాంత్,మోహన్ బాబు,రజినీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మోహన్ బాబు
    రజినీకాంత్ మోహన్ బాబు (rajinikanth mohan babu)


    నా మిత్రుడు రజినీకాంత్‌కు ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి. చీమకు కూడా ఎలాంటి హాని చేయనివాడివి. నా దృష్టిలో మీరు ఎంతో ఉన్నతులని చెప్పాను. నీలాంటి వ్యక్తికి .. నా లాంటి వాళ్లకు కూడా రాజకీయాలు పనికిరావు. మనిద్దరం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుదాం. అందులో నువ్వు సౌమ్యంగా మాట్లాడితే.. నేను ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతానని చెప్పాను. ఎవరికీ ద్రోహం చేయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేని వాళ్లము. అలాంటి పని కూడా చేయము. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదన్నారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనంత వరకు మనల్ని పొగిడిన వాళ్లే ఆ తర్వాత మనల్ని తిట్టడం మొదలు పెడతారు. చెడ్డవాళ్ల అంటూ మనల్ని ఆడిపోసుకుంటారు.

    ఎన్టీఆర్, రజినీకాంత్,మోహన్ బాబు (File/Photo)


    నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడిని, నా దృష్టిలో గొప్ప వ్యక్తులలో ఒకడివి. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే, మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే, రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి. రాజకీయం అనే బురదలో రజినీకాంత్  దిగకపోవడమే మంచిదన్నారు. ఆయన ఇందులో దిగకపోవడమే మంచిదన్నారు. ఇక రజినీకాంత్ ఫ్యాన్స్ అందరు ఆయన అంత మంచివాళ్లు. మీరందరూ కూడా నా మిత్రుడు రజినీకాంత్ నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మోహన్ బాబు కోరారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు