• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJINIKANTH MAY WRITE HIS OWN PUNCH DIALOGUES FOR ANNAATTHE SR

Rajinikanth: రజనీకాంత్ కొత్త అవతారం... పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్..

Rajinikanth: రజనీకాంత్ కొత్త అవతారం... పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్..

Photo : Twitter

Rajinikanth: ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. వారిచేత విజిల్ వేయించగలడు. శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాల్లో శివ అజిత్‌ను ఓ లేవల్లో చూపిస్తూ అదరగొట్టాడు. కాబట్టి ప్రస్తుతం రజనీతో చేస్తోన్న ఈ సినిమాలో శివ.. సూపర్ స్టార్‌ను ఏవిధంగా చూపిస్తాడో.. అని తెగ ఆసక్తితో చూస్తున్నారు అభిమానులు. ఇక మామూలుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలి‌లో యాక్టింగ్ చేస్తూ.. రజనీ పలికి సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్‌ సినిమా డైలాగ్స్‌ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు. కాగా రజనీ తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నాడని సమాచారం. శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తె’ కోసం రజనీ ఈ ప్రయోగం చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తిసురేష్‌‌లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటించబోతున్నాడు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం.

    ఈ సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకు తగ్గట్లుగా రజనీ పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్స్‌తో అదరగొడుతాడట. ఈ సినిమాలో రజనీ పాత్ర చాలా బాగుంటుందట. ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చడంతో సంభాషణల్ని తానే స్వయంగా రాస్తానని చిత్ర బృందానికి తెలియజేశాడట. దీంతో దర్శకుడు శివ కూడా ఓకే చెప్పడంతో రజనీకాంత్‌ ఇప్పటికే డైలాగ్స్ రాయడం కూడా మొదలు పెట్టాడట. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందట చిత్రబృందం. ఇక ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.

    ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ఈయన ఇటీవల ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యలో నటించి అదరగొట్టాడు. అయితే గతంలో ఈ పాత్రలోనే హీరో గోపీచంద్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. కాగా అలాంటిదేమి లేదని గోపీచంద్ స్పష్టతనిచ్చాడు. ఈ నేపథ్యంలో సత్య దేవ్.. రజనీ సినిమాలో నటించడం.. ఆయనకు మంచి అవకాశం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక ఇటీవల రజనీకాంత్ నటించిన పేట, దర్భార్ లాంటీ సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో రజనీకాంత్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి మరి శివ రజనీకాంత్‌కు ఏ రేంజ్‌లో హిట్ ఇస్తాడో..
    Published by:Suresh Rachamalla
    First published: