• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJINIKANTH MAN VS WILD SHOW WITH BEAR GRYLLS MOTION POSTER RELEASED AND IT GOES VIRAL PK

రజినీకాంత్ మ్యాన్ Vs వైల్డ్ మోషన్ పోస్టర్ విడుదల..

రజినీకాంత్ మ్యాన్ Vs వైల్డ్ మోషన్ పోస్టర్ విడుదల..

రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)

Man Vs Wild Rajinikanth: ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ఈ మధ్యే టీవీ షో చేసాడు. బుల్లితెరపై త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్. దీనికోసం ఆ మధ్య మూడు రోజుల పాటు షూటింగ్ కూడా చేసాడు రజినీ.

  • Share this:
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ఈ మధ్యే టీవీ షో చేసాడు. బుల్లితెరపై త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్. దీనికోసం ఆ మధ్య మూడు రోజుల పాటు షూటింగ్ కూడా చేసాడు రజినీ. ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు రజినీ. అక్కడే షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి కూడా గురయ్యారు. ఈ షూటింగ్ కర్ణాటకలో బందిపుర టైగర్ రిజర్వ్‌లో జరిగింది. జనవరి 28 నుంచి మూడు రోజుల పాటు ప్లాన్ చేసినా.. తొలిరోజే రజినీ గాయపడటంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ పూర్తి చేసారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ షోకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌ తన ట్విట్టర్లో విడుదల చేసాడు.

గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాకపోవడంతో వెంటనే షూట్‌కు వచ్చాడు రజినీ. ఇక సూపర్ స్టార్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి బేర్ గ్రిల్స్ ట్వీట్ చేసాడు. ప్రపంచంలో ఎంతోమంది సూపర్ స్టార్స్‌తో తాను పని చేసినా కూడా రజినీతో షూటింగ్ అనుభవం మాత్రం చాలా ప్రత్యేకం అంటూ రాసుకొచ్చాడు ఈయన. త్వరలోనే ఎపిసోడ్ ప్లే కానుంది. ఇప్పుడు విడుదలైన మోషన్ పోస్టర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్.. శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలోనే జరుగుతుంది. కచ్చితంగా బుల్లితెరపై రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు షో నిర్వాహకులు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు