news18-telugu
Updated: July 9, 2020, 6:56 PM IST
రజినీకాంత్‌తో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ (Twitter/Photo)
ప్రస్తుతం కరోనా మహామ్మారి మన దేశంతో పాటు అన్ని దేశాల్లో కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఈ మహమ్మారి దెబ్బకు మరో ఇప్పటికే పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు మృతి చెందారు. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు కరోనా వచ్చి తగ్గిపోయింది. దీంతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. ఇక తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి హీరోయిన్.. మాండ్యా ఎంపీ సుమలతకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ సంగతి మరవక ముందే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భాషల్లో సినిమాలను నిర్మించడమే కాదు... పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత నటుడు రాక్‌లైన్ వెంకటేష్‌కు కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి.ఈయన రజినీకాంత్‌తో ‘లింగ’ మూవీతో పాటు సల్మాన్ ఖాన్‌తో ’బజరంగీ భాయిజాన్’ వంటి సినిమాలను నిర్మించారు.

రాక్‌లైన్ వెంకటేష్ (File/Photo)
ఈయన కొద్ది రోజుల నుంచి ఎంపీ సుమలతతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక సుమలతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఈయన అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన వెంకటేష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా అని కన్నడ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 9, 2020, 6:56 PM IST