తమిళ సూపర్ స్టార్ నటుడు రజనీకాంత్ వైద్య చికిత్స కోసం ఈ ఉదయం ప్రైవేట్ విమానంలో అమెరికా బయలుదేరారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆయన హెల్త్ చెక అప్ కోసం అమెరికా వెళ్లినట్లు టాక్. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ అమెరికా పయనం అయ్యి ఉండోచ్చని అంటున్నారు. ఇక గత సంవత్సరం కోవిడ్ -19 ఆంక్షల కారణంగా, ఆయన అమెరికా వెళ్లలేకపోయారు. అయితే ఈ సారి మాత్రం ప్రత్యేక అనుమతితో అమెరికా వెళ్లారు. హాలీవుడ్ షూట్ కారణంగా నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య ప్రస్తుతం యుఎస్ లోనే ఉన్నారు. రజనీకాంత్ జూలై 8 న తిరిగి ఇండియాకు పయనం అవుతారని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే రజనీ 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించాలనీ ప్లాన్ వేసారు. అందులో భాగంగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని భావించినా.. కోవిడ్ కారణంగా వైద్యుల సలహా మేరకు ఆ ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఇక ఆయన నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.
ఈ సినిమా కోసం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కూడా రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్‌లో అన్నాత్తే చిత్రం కోసం 35 రోజుల పాటు షూటింగ్లో పాల్గోన్నారు. ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు.
ఈ సినిమా గురించి మరో విశేషం ఏమంటే.. మామూలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ.. రజనీ పలికి సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్ సినిమా డైలాగ్స్ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు. కాగా రజనీ ఈ ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నారట. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అన్నాత్తే దీపావళీ పండుగ సందర్భంగా నవంబర్ 4 న విడుదల కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.