సూపర్ స్టార్ రజినీకాంత్ గత 48 గంటలుగా అపోలో ఆస్పత్రిలోనే ఉన్నాడు. అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. ఉన్నట్లుండి ఈయన బిపి పెరగడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసారు. అన్నాత్తై షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న రజినీ.. అక్కడే అనారోగ్యం పాలయ్యాడు. దాంతో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. రజినీ ఆరోగ్యంపై అంతా ఆరా తీస్తున్నారు. ఎలా ఉందంటూ ప్రతీ క్షణం మానిటర్ చేస్తూనే ఉన్నారు. వైద్యులు కూడా నిరంతరం ఆయన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు రజినీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. బిపి సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్‌కు మళ్లీ అలాంటి సమస్యలు రాలేదు. రజనీకి మరోసారి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించారు అపోలో వైద్యులు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చేసారు. దానికితోడు రాత్రంతా రజనీ బీపీ లెవెల్స్ మానిటరింగ్ చేసారు వైద్యులు. అందులో కూడా ఎలాంటి తేడా కనిపించలేదు. దాంతో అంతా ఓకే అనుకుంటే డిసెంబర్ 27న ఈయన్ని డిశ్చార్జ్ చేయనున్నారు వైద్యులు. దీనికి సంబంధించిన హెల్త్ బులెటన్ మళ్లీ విడుదల చేయనున్నారు వైద్యులు. ప్రస్తుతం ఈయన శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Telugu Cinema, Tollywood