హోమ్ /వార్తలు /సినిమా /

Lal Salaam: కూతురుతో రజినీకాంత్ న్యూ స్టెప్.. లాల్ సలాం అంటున్న తలైవా

Lal Salaam: కూతురుతో రజినీకాంత్ న్యూ స్టెప్.. లాల్ సలాం అంటున్న తలైవా

Lal Salaam (Photo Twitter)

Lal Salaam (Photo Twitter)

Rajinikanth Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా లాల్ సలాం. తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ రివీల్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ వైడ్ ఈ తమిళ తలైవా సినిమాలకు సూపర్ డిమాండ్ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారల్లో ఒకరు రజినీకాంత్. వెండితెరపై ఎంతో స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. గత కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నారు. నేటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇటీవల ఆరోగ్యరీత్యా కొన్ని నెలలు సినిమాలకు దూరంగా రజనీ కాంత్ ఇప్పుడు జోష్ పెంచారు. తాజాగా రజినీకాంత్‌ మరో ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేశారు.

లాల్‌ సలాం (Lal Salaam) అనే కొత్త సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రకటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో రూపొందనున్న ఈ చిత్రానికి రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ వదిలిన ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాను క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదలకు సిద్దం చేయనున్నారు మేకర్స్.

ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీ కాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది రజినీకాంత్ నుంచి ఈ రెండు సినిమాల విడుదల ఉండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాలపై తలైవా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

First published:

Tags: Kollywood, Rajini Kanth, Super star Rajinikanth

ఉత్తమ కథలు