రజినీకాంత్, కమల్ హాసన్...ఒకరి దారిలో మరొకరు

Rajinikanth, Kamal Haasan | తమిళ సినీ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్‌ ఎవరి పంథా వారిదే. రజినీ కమర్షియల్ సినిమాలతో స్టార్ డమ్ అందుకుంటే..కమల్ హాసన్ తనకు మాత్రమే సాధ్యమయ్యే సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇద్దరు దాదాపు ఒకేసారి హీరోగా కెరీర్ స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఒకే పంథాలో తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 18, 2019, 8:21 AM IST
రజినీకాంత్, కమల్ హాసన్...ఒకరి దారిలో మరొకరు
కమల్ హాసన్, రజినీకాంత్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
తమిళ సినీ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్‌ ఎవరి పంథా వారిదే. రజినీ కమర్షియల్ సినిమాలతో స్టార్ డమ్ అందుకుంటే..కమల్ హాసన్ తనకు మాత్రమే సాధ్యమయ్యే సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇద్దరు దాదాపు ఒకేసారి హీరోగా కెరీర్ స్టార్ట్ చేసారు.

అంతేకాదు తాజాగా వీళ్లిద్దరు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆల్రెడీ కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీతో యాక్టివ్ పొలిటిషన్‌గా మారాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరి ప్లాన్ ఒకటేనా ? Rajinikanth, Kamal Haasan Both Heroes Plans similar To Act Political Movies
‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్


ఈ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఇండియన్ 2’ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్టే ‘ఇండియన్ 2’ సినిమాలో సమకాలీన రాజకీయా అంశాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడట.

రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరి ప్లాన్ ఒకటేనా ? Rajinikanth, Kamal Haasan Both Heroes Plans similar To Act Political Movies
కమల్ హాపన్, శంకర్


ఇంకోవైపు రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికీ ప్రకటించాడు. అందుకే ఇపుడు మురుగదాస్‌తో చేయబోయే సినిమాను పూర్తి రాజకీయ నేపథ్య కథతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రజినీకాంత్ ‘కాలా’, ‘పేట’ సినిమాల్లో చెప్పకనే తన రాజకీయ నేపథ్య ఏమిటో చెప్పకనే చెప్పాడు.

రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరి ప్లాన్ ఒకటేనా ? Rajinikanth, Kamal Haasan Both Heroes Plans similar To Act Political Movies
‘పేట’లో రజినీకాంత్ (ట్విట్టర్ ఫోటో)
తాజాగా మురుగదాస్‌తో చేయబోయే సినిమా తర్వాత రజినీకాంత్ కూడా దాదాపు సినిమాలకు పులిస్టాప్ పెట్టి..తన దృష్టి మొత్తాన్ని రాజకీయాలకే కేటాయించాలనే ఆలోచనలో ఉన్నాడు.

రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరి ప్లాన్ ఒకటేనా ? Rajinikanth, Kamal Haasan Both Heroes Plans similar To Act Political Movies
రజనీకాంత్, కమల్ హాసన్


మొత్తానికి తమిళ సినిమాల్లో సమఉజ్జీగా ఉన్న రజినీకాంత్, కమల్ హాసన్‌లు రాబోయే కాలంలో తమిళనాడు రాజకీయాలను శాసించడానికి ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.

కథానాయకుడు లో చాలా సీన్లను తీసేయాల్సి వచ్చింది : బాలకృష్ణ


ఇవి కూడా చదవండి 

స్మృతిలో: భారతీయ చిత్ర రంగ ప్రముఖుడు ఎల్.వి.ప్రసాద్

టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్

ముంచేసిన ‘వినయ విధేయ రామ’.. భయంతో డిస్ట్రిబ్యూటర్లు..
Published by: Kiran Kumar Thanjavur
First published: January 18, 2019, 8:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading