రజినీకాంత్, కమల్ హాసన్ జట్టు.. తమిళనాట మిగిలిన పార్టీల ఆటకట్టు..?
ఏమో ఇప్పుడు ఇవే వార్తలే తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ పార్టీ మీటింగ్ సమయంలో అభిమానులతో కూర్చున్నపుడు తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని చెప్పాడు రజినీకాంత్.

రజనీకాంత్, కమల్ హాసన్
- News18 Telugu
- Last Updated: November 20, 2019, 10:49 PM IST
ఏమో ఇప్పుడు ఇవే వార్తలే తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ పార్టీ మీటింగ్ సమయంలో అభిమానులతో కూర్చున్నపుడు తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని చెప్పాడు రజినీకాంత్. అసలు తన పార్టీ ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదని.. ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని.. అలా ఎవరైనా చెప్తే నమ్మకండి అని చెప్పాడు సూపర్ స్టార్. అయితే ఇప్పుడు మాత్రం ఉన్నట్లుండి మాట మార్చేసాడు ఈయన. తన తోటి నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించాడు సూపర్ స్టార్. ఇదే విషయాన్ని అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేసాడు కమల్.

రజినీ తన పార్టీకి మద్దతివ్వడం ఆనందంగా ఉందని చెప్పాడు ఈయన. ఆ మధ్య తన పార్టీ కేంద్ర కార్యాలయంలో రజినీతో జరిగిన భేటీ సందర్భంగా మద్దతు కోరానని చెప్పాడు కమల్ హాసన్. దానికి ఆయన కూడా సరే అన్నాడని చెప్పాడు కమల్. అయితే ఈ విషయం విన్న తర్వాత రజినీ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఎవరికీ సపోర్ట్ చేయనని చెప్పి.. ఇప్పుడు కమల్ పార్టీని సపోర్ట్ చేయడాన్ని చూసి షాక్ అవుతున్నారు. అయితే ఇద్దరు లెజెండ్స్ కలిసి పని చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు.
ఇప్పుడు కాకపోయినా కూడా భవిష్యత్తులో అయినా కూడా ఇద్దరం కలిసి తమిళనాడు ఫ్యూచర్ కోసం పోరాడతాం అని చెబుతున్నాడు రజినీ. రేపటి రోజు కచ్చితంగా మనదే అవుతుందని చెప్పాడు ఈయన. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని క్లారిటీ ఇచ్చాడు లోక నాయకుడు. స్థానిక ఎన్నికల్లో కమల్, రజినీ కలిసి పోటీ చేయబోతున్నారు. కమల్ పార్టీ అభ్యర్థులకు రజినీకాంత్ తన అండదండలు పుష్కలంగా ఇస్తున్నాడు. మరి రజినీ, కమల్ కలిసి ఎలాంటి మార్పుకు శ్రీకారం చుడతారో చూడాలి.

కమల్ని కలిసిన రజినీకాంత్(twitter/BARaju)

కమల్ హాసన్, రజినీకాంత్ (ఫైల్ ఫోటోస్)

Loading...