రజినీకాంత్‌ను అవమానించిన నిర్మాత.. ‘దర్బార్’ ఆడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లెేటెస్ట్ మూవీ ‘దర్బార్’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రీసెంట్‌గా విడుదలైంది. ఈ వేడుకలో రజినీకాంత్.. కెరీర్ తొలినాళ్లలో ఒక నిర్మాత నుండి తనకు జరిగిన పరాభవం గురించి అభిమానులతో పంచుకున్నారు.

news18-telugu
Updated: December 9, 2019, 1:31 PM IST
రజినీకాంత్‌ను అవమానించిన నిర్మాత.. ‘దర్బార్’ ఆడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు..
‘దర్బార్’ ఆడియోలో రజినీకాంత్ ఎమోషనల్ స్పీచ్ (Photo/Special Arrangement)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లెేటెస్ట్ మూవీ ‘దర్బార్’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రీసెంట్‌గా విడుదలైంది. ఈ వేడుకలో రజినీకాంత్.. కెరీర్ తొలినాళ్లలో ఒక నిర్మాత నుండి తనకు జరిగిన పరాభవం గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను నటుడిగా నాలుగైదు సినిమాలు చేసిన ఓ నిర్మాత నాకు ఫోన్ చేసి మా సినిమాలో వేషం ఉంది మీరు చేయాలన్నారు. నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాను. ఫోన్‌లో ఆయనతో మాట్లాడాకా.. ఆ సినిమాలో నటిస్తే ..రూ 6 వేలు రెమ్యునరేషన్ ఇస్తానన్నాడు. సినిమా ప్రారంభం అయ్యే ముందు రూ.వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తానని మా మధ్య అంగీకారం కుదరింది. అంతేకాదు నెక్ట్స్ డే నా ఇంటికి కారు పంపుతానని అన్నారు. అపుడే అడ్వాన్స్ కూడా ఇస్తామన్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు రావాల్సిన కారు.. తొమ్మిది గంటలకు వచ్చింది. ఆ సమయంలో ప్రొడక్షన్ మేనేజర్ నాకు ఇస్తానన్న అడ్వాన్స్ ఇవ్వలేదు. నేనా విషయాన్ని మేనేజర్‌ను అడిగాను. ఆయన మీరు మేకప్ వేసుకొని రెడీ అవ్వండి అపుడు ఇస్తానన్నారు.super star rajinikanth ar murugadoss darbar audio release event,darbar audio launch,darbar audio launch live,darbar rajinikanth,darbar,rajinikanth,rajinikanth speech in darbar audio launch,darbar audio,darbar audio songs,darbar audio launch update,rajini darbar,darbar songs,darbar teaser,rajinikanth darbar,darbar audio launch rajini speech,darbar trailer,darbar audio launch date,darbar audio launch tamil,rajinikanth darbar audio launch,darbar latest update,kollywood,tollywood,రజినీకాంత్,దర్బార్ ఆడియో,దర్బార్ ఆడియో రిలీజ్,సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్,ఏఆర్ మురుగదాస్,లైకా ప్రొడక్షన్స్
రజినీకాంత్ ‘దర్బార్’ ఆడియో (Photos/Special arrangement)నేను మేకప్ కోసం ఏవిఎం స్టూడియోకు వెళ్లాను. ఆ తర్వాత మేకప్ వేసుకొన్న తర్వాత అడ్వాన్స్ గురించి అడిగాను. వాళ్లు తర్వాత ఇస్తామని మాట మార్చారు. నేను కుదరదన్నాను. అదే సమయంలో ఖరీదైన పెద్ద పడవలాంటి కారు వచ్చింది. అందులో నుండి చిత్ర నిర్మాత దిగారు. నా దగ్గరకు వచ్చి అడ్వాన్స్ ఇవ్వకపోతే.. నటించనని చెప్పావు. నువ్వేమైనా గొప్ప నటుడని అనుకుంటున్నావా ? అడ్వాన్స్ ఇవ్వకపోతే నటించకపోవడానికి. నీలాంటి వాళ్లకు నా సినిమాలో వేషం లేదు. మర్యాదగా బయటకు పో అన్నారు. దానికి నేను మీరు పిలుస్తేనే కదా నేను వచ్చాను. ఇపుడేమో ఇలా అంటున్నారు. సరే వెళ్లిపోతాను. నన్ను ఇంటి దగ్గర దింపండి అన్నాను. అసలు కారు లేదు. ఏమి లేదు. నువ్వు ఎలాగైనా వెళ్లు నాకు అవసరం లేదన్నారు. నేను కోపంగా బయటకు వచ్చాను.rajinikanth interesting facts about darbar audio release event,rajinikanth audio release event,rajinikanth interesting comments,darbar audio launch,darbar audio launch live,darbar rajinikanth,darbar,rajinikanth,rajinikanth speech in darbar audio launch,darbar audio,darbar audio songs,darbar audio launch update,rajini darbar,darbar songs,darbar teaser,rajinikanth darbar,darbar audio launch rajini speech,darbar trailer,darbar audio launch date,darbar audio launch tamil,rajinikanth darbar audio launch,darbar latest update,kollywood,tollywood,రజినీకాంత్,దర్బార్ ఆడియో,దర్బార్ ఆడియో రిలీజ్,సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్,ఏఆర్ మురుగదాస్,లైకా ప్రొడక్షన్స్.రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘దర్బార్’ ఆడియోలో రజినీకాంత్ (special Arrangement)


నేను కోపంతో అక్కడి నుండి నడుచుకుంటూ బయటకు వెళ్లాను. కానీ నా మదిలో మాత్రం నన్ను అంత మాట అంటారా ? ఎలాగైన పెద్ద స్టార్ అయిపోవాలని అపుడే డిసైడ్ అయ్యాను. ఆ కసితోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆ తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పెద్ద కారు కొనుక్కొని ఒక ఆంగ్లో ఇండియన్‌ను కారు డ్రైవర్‌గా పెట్టుకొని ముందుగా ఏవీఎం స్టూడియోకు వెళ్లి ఎక్కడైతే.. ఆ నిర్మాత తన కారుని ఆపాడే అక్కడే నా కారును ఆపి స్టైల్‌గా ఆ నిర్మాత ముందు సిగరెట్స్ తాగానన్నారు. అక్కడి నుంచి మా గురువు గారైన బాలచందర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాను ఆ విషయాలను గుర్తు చేసారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 9, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading