సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. డిసెంబర్ 31న తన కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న రజినీకాంత్, ఈలోపు సడన్‌గా హైదరాబాద్ వచ్చారు. అక్కడ పార్టీ ఏర్పాట్ల పనిలో తలమునకలై ఉండాల్సిన తలైవా భాగ్యనగరానికి ఎందుకు వచ్చారో తెలుసా. సినిమా షూటింగ్ కోసం. ఔను. మీరు చదివింది కరెక్టే. సినిమా షూటింగ్ కోసమే. తెలుగులో ఓ సామెత ఉంటుంది. ‘తమ్ముడు తమ్ముడే,పేకాట పేకాటే.’ అనేది ఆ సామెత. అంటే, రజనీకాంత్ కూడా ఇదే సామెతను ఫాలో అవుతున్నట్టున్నారు. సినిమాలు సినిమాలే. పార్టీ పార్టీనే అన్నట్టుగా పార్టీ పని అప్పుడు చూసుకుందాం. ఈ లోపు సినిమా షూటింగ్ పని చూద్దామనే ఉద్దేశంతో రజినీకాంత్ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. ప్రస్తుతం రజినీకాంత్, నయతనార కాంబినేషన్లో ‘అన్నాత్తీ’ అనే తమిళ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఆదివారం నాడు రజినీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం నుంచే సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..
Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
TATA Cars offers: డిసెంబర్లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
శిరుత్తై శివ రజినీకాంత్‌ను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్బూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్, నయనతార హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరూ ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారని, ఈ సినిమా పబ్లిసిస్టులు కూడా ధ్రువీకరించారు. అన్నాత్తీ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. మరో 40 శాతం, అంతకంటే తక్కువ షూటింగ్ పెండింగ్ ఉందని, ఇటీవల రజినీకాంత్ చెప్పారు. ఈ సినిమాలో చెల్లిని ప్రేమగా, జాగ్రత్తగా, చెల్లిని కంటిపాపలా చూసుకునే అన్నలా కనిపించనున్నాడు. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి
విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం
ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..
రజినీకాంత్, నయనతార కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమాలో రజినీ సరసన నయన్ నటించింది. ఇప్పుడు మూడోసారి జట్టుకట్టనుంది. మూడు నాలుగు వారాల్లో అన్నాత్తీ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలిసింది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత రజినీ తన పొలిటికల్ కెరీర్ మీద దృష్టి పెట్టనున్నారు. 2021 ఏప్రిల్ - మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తాను ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ ముందుకొచ్చారు రజినీకాంత్. చాలా సంవత్సరాల నుంచి ఉన్న సస్పెన్స్‌కు బ్రేక్ వేస్తూ తాను పొలిటికల్ పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. తన పార్టీ అవినీతి రహితంగా, నిజాయితీగా, పారదర్శకంగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth