సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ‘రజినీకాంత్ ఆరోగ్యం, ఆయన బ్లడ్ ప్రెజర్‌కు సంబంధించి అందుతున్న వైద్యంపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆయన ఈ రోజు రాత్రి కూడా ఆస్పత్రిలోనే ఉంటారు. రేపు మరికొంత పరిశీలించాలి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. రజినీకాంత్ కుటుంబసభ్యులు, డాక్టర్లు అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అభిమానులు, ఆత్మీయులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. ఆస్పత్రి వద్ద విజిటర్స్ ఎవరినీ అనుమతించడం లేదు. రజినీకాంత్ కుమార్తె కూడా ఆయనతో ఉన్నారు.’ అని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజినీకాంత్ ఆరోగ్యంపై వాకబు చేశారు. డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత.. రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా ?
Rajinikanth: రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన.. కోలుకోవాలంటూ ప్రార్థనలు
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు ఉదయం 9 గంటలకు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హై బీపీ రావడంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి వరకు కారులో వచ్చిన ఆయన అక్కడ మామూలుగానే నడుచుకుంటూ వెళ్లారు. రజినీకాంత్ సహజంగా టెస్టుల కోసం వచ్చి ఉంటారని భావించారు. కానీ, ఆయనకు హై బీపీ రావడంతో ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం చికిత్స జరుగుతోంందని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. రజినీకాంత్‌కు అపోలో ఆస్పత్రిలోని ఇంటర్నేషనల్ సూట్లోని ప్రత్యేక రూంలో వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారన్నారు. కూతురు ఐశ్వర్యను సైతం రూం దగ్గరకు రజినీ రావొద్దని చెప్పినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.
Called @HospitalsApollo @ #Hyderabad enquired about the health of Thiru @rajinikanth ...I wish him a speedy recovery ...
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 25, 2020
రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. తన అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం ఆయన భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. కీర్తి సురేష్ ఈ సినిమాలో రజినీకాంత్ సోదరిగా నటిస్తోంది. అయితే, అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయినా ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ రోజు సడన్‌గా హై బీపీతో ఆస్పత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని అపోలో వైద్యులు ధ్రువీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Rajinikanth