హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్.. అపోలో డాక్టర్లు ఏమన్నారంటే..

Rajinikanth: రజినీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్.. అపోలో డాక్టర్లు ఏమన్నారంటే..

రజినీకాంత్ (Rajinikanth)

రజినీకాంత్ (Rajinikanth)

Rajinikanth Health Bulletin: ‘రజినీకాంత్ ఆరోగ్యం, ఆయన బ్లడ్ ప్రెజర్‌కు సంబంధించి నిరంతరం అపోలో డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తోంది.

Rajinikanth Health Bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. "నిన్న ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ త్వరగా కోలుకుంటున్నారు. గత రాత్రి ఆయనకు ఆనారోగ్యం బాధించింది. ఇప్పటికీ ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉన్నా... నిన్నటి కంటే ఇవాళ ఆయన బెటర్‌గా ఉన్నారు. ఆయనపై జరిపిన పరీక్షల్లో ఇప్పటివరకూ ఏవీ ఆందోళనకరమైన ఫలితాలు రాలేదు. ఇవాళ కూడా కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వాటి ఫలితాల రిపోర్టులు సాయంత్రానికి" వస్తాయి. అని అపోలో హాస్పిటల్స్ తన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

"రజనీకాంత్ బ్లడ్ ప్రెషర్ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఆయన ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. బీపీ కారణంగా... ఆయన పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. సందర్శకులు ఎవరూ ఆయన్ని కలవడానికి వీలు లేదు." అని అపోలో హాస్పిటల్స్ తెలిపింది.

"జరిపే పరీక్షల రిపోర్టుల్లో వచ్చే ఫలితాలు, బ్రడ్ ప్రెషర్ ఎంతవరకూ కంట్రోల్ అవుతుంది అనే అంశాలను బట్టి... రజనీకాంత్‌ని ఎప్పుడు డిశ్చార్జి చేసేదీ సాయంత్రం తెలుపుతాం" అని అపోలో హాస్పిటల్స్ తన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

ఆపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజినీకాంత్ ఆరోగ్యంపై వాకబు చేశారు. డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న ఉదయం 9 గంటలకు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హై బీపీ రావడంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి వరకు కారులో వచ్చిన ఆయన అక్కడ మామూలుగానే నడుచుకుంటూ వెళ్లారు. రజినీకాంత్ సహజంగా టెస్టుల కోసం వచ్చి ఉంటారని భావించారు. కానీ, ఆయనకు హై బీపీ రావడంతో ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం చికిత్స జరుగుతోంందని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. రజినీకాంత్‌కు అపోలో ఆస్పత్రిలోని ఇంటర్నేషనల్ సూట్‌లోని ప్రత్యేక రూంలో వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారన్నారు. కూతురు ఐశ్వర్యను సైతం రూం దగ్గరకు రజినీ రావొద్దని చెప్పినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.

ఇది కూడా చదవండి:India Covid 19: ఇండియాలో కంట్రోల్‌లో ఉన్న కరోనా... సమస్యంతా కొత్త వైరస్ గురించే...

రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. తన అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం ఆయన భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. కీర్తి సురేష్ ఈ సినిమాలో రజినీకాంత్ సోదరిగా నటిస్తోంది. అయితే, అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయినా ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. నిన్న సడెన్‌గా హై బీపీతో ఆస్పత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని అపోలో వైద్యులు ధ్రువీకరించారు.

First published:

Tags: Cinema, Rajinikanth

ఉత్తమ కథలు