రజినీకాంత్ మనసున్న మారాజు.. ఆ నిర్మాతకు బహుమతిగా ఇల్లు..

రజనీకాంత్‌ గురించి తమిళనాట అంతా ఒకే మాట చెప్తుంటారు. మనసున్న మారాజు అని.. నమ్ముకున్న వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని సూపర్ స్టార్ గురించి తెలిసిన వాళ్లు చెప్తుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 7, 2019, 4:05 PM IST
రజినీకాంత్ మనసున్న మారాజు.. ఆ నిర్మాతకు బహుమతిగా ఇల్లు..
నిర్మాతకు ఇల్లు బహూకరించిన రజినీకాంత్
  • Share this:
రజనీకాంత్‌ గురించి తమిళనాట అంతా ఒకే మాట చెప్తుంటారు. మనసున్న మారాజు అని.. నమ్ముకున్న వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని సూపర్ స్టార్ గురించి తెలిసిన వాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు మరోసారి దీన్ని ప్రూవ్ చేసుకున్నాడు రజినీ. ఈ మధ్యే ఓ సభలో తనకు లైఫ్ ఇచ్చిన నిర్మాతకు ఇంటిని గిఫ్టుగా ఇస్తానని చెప్పాడు రజినీకాంత్. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఈయన. ప్రముఖ నిర్మాత, రచయిత కలైజ్ఞానంకు ఇంటిని కొనిచ్చారు సూపర్ స్టార్. అంతేకాదు.. ఆ గృహ ప్రవేశానికి వచ్చి కాసేపు కలైజ్ఞానం కుటుంబసభ్యులతో గడిపాడు రజినీ.
నిర్మాతకు ఇల్లు బహూకరించిన రజినీకాంత్

ఈ గృహ ప్రవేశ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ పెద్ద మనసు చూసి అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోటి రూపాయలకు పైగానే ఉండే ఈ ఇంటిని తన నిర్మాత కోసం గిఫ్టుగా ఇచ్చేసాడు సూపర్ స్టార్. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ నిర్మాత అంటే రజినీకాంత్‌కు అంత ప్రేమ ఎందుకో తెలుసా.. దాదాపు 41 ఏళ్ల కింద రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి సినిమా 'భైరవి'ని కలైజ్ఞానం నిర్మించాడు. 'భైరవి' సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని రజినీ చాలా సార్లు చెప్పాడు.

నిర్మాతకు ఇల్లు బహూకరించిన రజినీకాంత్

అంతేకాదు.. 2019 ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మానసభకు కూడా వచ్చాడు రజినీ. ఆ కార్యక్రమంలో భారతీరాజా, శివకుమార్‌ కూడా వచ్చారు. అప్పుడే తన నిర్మాత కలైజ్ఞానం అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని.. ఆయన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సాయం చేయాలని కోరాడు శివకుమార్. విషయం తెలుసుకున్న రజినీకాంత్.. స్వయంగా తానే కలైజ్ఞానంకు ఇల్లు కొనిస్తానని.. ఈ అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వనని.. త్వరలోనే కలైజ్ఞానంకు సొంత ఇల్లు ఉంటుందని మాటిచ్చాడు. ఇప్పుడు అన్న మాట ప్రకారమే సొంతింటిని కొనిచ్చాడు రజినీకాంత్.


First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading