తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా రజనీ పేరుతో వెలువడిన ఓ లెటర్లో ఆయన రాజకీయాలకు నమస్తే చెప్పనున్నాడనే ఓ వార్త హల్ చల్ చేయగా.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ రాజకీయాలకు స్వస్థి పలకనున్నాడని ఈ తాజా వార్త సారాంశం. అంతేకాదు రజనీ తన ఈ నిర్ణయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో రజనీకాంత్ అభిమానులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు భైఠాయించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు...రజనీ రాజకీయాల్లోకి రావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకువస్తోన్న సమయాన రజనీ రాజకీయ ప్రవేశంపై వస్తోన్న ఇలాంటీ వార్తలు ఆయన అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి.
ఇక రజనీ సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మామూలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ.. రజనీ పలికి సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్ సినిమా డైలాగ్స్ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు. కాగా రజనీ తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నాడని సమాచారం. శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తె’ కోసం రజనీ ఈ ప్రయోగం చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తిసురేష్‌లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించబోతున్నాడు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tollywood news