హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్ కు కొత్త తలనొప్పులు... పట్టించుకోని అభిమానులు

Rajinikanth: రజినీకాంత్ కు కొత్త తలనొప్పులు... పట్టించుకోని అభిమానులు

అయితే ఒకవేళ మొండిగా ముందుకెళ్లినా కూడా రజినీకాంత్ పార్టీకి కూడా ఇదే రకమైన పరాభవమే ఎదురయ్యేదని తమిళనాట రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. బయట పరిస్థితులు చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే రజినీ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు సన్నిహితులు కూడా.

అయితే ఒకవేళ మొండిగా ముందుకెళ్లినా కూడా రజినీకాంత్ పార్టీకి కూడా ఇదే రకమైన పరాభవమే ఎదురయ్యేదని తమిళనాట రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. బయట పరిస్థితులు చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే రజినీ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు సన్నిహితులు కూడా.

Rajinikanth - Political Entery: తలైవా రజినీకాంత్‌ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై ఆదివారం రజినీకాంత్‌ అభిమాను ధర్నా చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు సరికొత్త చిక్కులు మొదలయ్యాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన తలైవాకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయాల నుండి డ్రాప్‌ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన రాజకీయాల్లోకి రాకపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ అభిమాని నిప్పు అంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరోసారి తలైవా అభిమానులు ఆందోళనకు దిగారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని రజినీకాంత్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంఊ ఆందోళన చేస్తున్నారు. మరి అభిమానుల ఆందోళన రజినీకాంత్‌కు కొత్త తలనొప్పులు తీసుకొస్తాయేమోనని, ఆయన సన్నిహితులు టెన్షన పడుతున్నారు. మరో వైపు రజినీకాంత్‌ ఈ ఆందోళనపై ఏమై స్పందిస్తారేమో చూడాలి.

డిసెంబర్‌ 31న పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పిన రజినీకాంత్‌, సంక్రాంతికి పార్టీని స్టార్ట్‌ చేసి ఈ ఏడాది వేసవిలో జరిగే అసెంబ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి రజినీకాంత్‌ నిర్ణయించుకున్నారు. అయితే అనుకోకుండా, హై బీపీ రావడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. రజినీకాంత్‌ టెన్షన్‌ పెట్టే పరిస్థితులకు దూరంగా ఉండాలని డాక్టర్స్‌ సూచించడంతో రజినీకాంత్‌ తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు అన్నారు. అయితే రజినీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించకుండానే తప్పుకోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడగానే, అణ్ణాత్తే షూటింగ్‌ను స్టార్ట్‌ చేయడానికి రజినీకాంత్‌ ఓకే చెప్పారట. ఫిబ్రవరి నుండి చెన్నైలో సెట్‌ వేసి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేశ్‌ తదితరులు నటిస్తున్నారు. శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

First published:

Tags: Rajinikanth, Tamil nadu Politics

ఉత్తమ కథలు