సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు అంతకంటే ఆనందం మరోటి ఏముంటుంది.. వాళ్లకు అదే పండగ కూడా. రజినీ సినిమా అంటే వారం రోజుల ముందు నుంచే హంగామా కనిపిస్తుంది. ఇప్పుడు దర్బార్ సినిమాతో వస్తున్నాడు ఈయన. సంక్రాంతి పండగను ముందే తీసుకొస్తాడని అభిమానులు కూడా నమ్ముతున్నారు. తెలుగులో ఈ చిత్రంపై అంచనాలు అంతగా లేవు కానీ తమిళనాట మాత్రం భారీగానే ఉన్నాయి. పైగా రజినీ సినిమా అంటే తమిళనాట పండగే కదా.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.
తలైవా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సినిమా టికెట్లు కొని ఇవ్వడంతో పాటు.. హాలీడే కూడా అనౌన్స్ చేసింది. ఆఫీసులకు రాకపోయినా పర్లేదు మేం పే చేస్తామంటూ ప్రకటించింది. 'మై మనీ మంత్ర' అనే కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది.
పొంగల్ బోనస్‌తో పాటు టికెట్లు అందిస్తున్నామని.. జనవరి 9న దర్బార్ రిలీజ్ డేను సెలవుగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్ సర్కులర్ విడుదల చేసాడు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొన్ని కంపెనీలు రజనీ సినిమా విడుదల రోజున టికెట్లు పంచాయి. సెలవు దినంగా ప్రకటించాయి.. ఇప్పుడు మరో కంపెనీ యాడ్ అయింది. గతంలో కబాలి, 2.0 సినిమాలు విడుదలైనపుడు కూడా ఇలాగే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హాలీడే ఇచ్చాయి. ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Rajinikanth, Telugu Cinema, Tollywood