Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 8, 2020, 6:10 PM IST
రజినీకాంత్ (Twitter/Photo)
సంక్రాంతి పండగను అందరికంటే ముందు మొదలుపెడతున్నాడు రజినీకాంత్. ఈయన నటించిన దర్బార్ సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. చాలా ఏళ్ళ తర్వాత ఈయన ఖాకీ డ్రస్ వేసుకున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది.

దర్బార్ సినిమా Twitter
దానికితోడు మురుగదాస్ దర్శకుడు కావడంతో ఆసక్తి బాగానే కనిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో కూడా భారీగానే విడుదలవుతుంది. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు వస్తుండటంతో రెండు రోజుల పాటు భారీగా స్క్రీన్స్ ఇచ్చారు ఈ చిత్రానికి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 750 స్క్రీన్స్‌లో విడుదలవుతుంది దర్బార్. తెలుగులో ఈ చిత్రం దాదాపు 8 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తమిళనాట 63 కోట్లు.. హిందీలో 17 కోట్లు.. కేరళలో 5.5 కోట్లు.. కర్ణాటకలో 7 కోట్లు.. ఓవర్సీస్ 33 కోట్లు.. డిజిటల్ అమేజాన్ 25 కోట్లు.. ఆడియో 5 కోట్లు కలిపి మొత్తం 196 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం.

ఏ.ఆర్.మురుగదాస్,రజినీకాంత్ ‘దర్బార్’ షూటింగ్ పూర్తి (Twitter/Photo)
ఈ చిత్రం తెలుగులో భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి. గతేడాది సంక్రాంతికి విడుదలైన పేట తొలిరోజు తెలుగులో 1.7 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సారి ఎలాంటి పోటీ లేకుండా ఉండటంతో కనీసం 3 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సరిలేరు నీకెవ్వరు రావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి కచ్చితంగా రజినీ దున్నేసుకోవడం ఖాయం.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 8, 2020, 6:10 PM IST