హోమ్ /వార్తలు /సినిమా /

పాపం రజినీకాంత్... దర్బార్ కూడా దెబ్బకొట్టింది

పాపం రజినీకాంత్... దర్బార్ కూడా దెబ్బకొట్టింది

వాళ్ల కోసం ఈయన కూడా ఏదైనా చేస్తుంటాడు. ఎవరైనా అభిమాని కష్టంలో ఉంటే వెంటనే స్పందించి సాయం చేస్తుంటాడు సూపర్ స్టార్. తన వరకు రాకపోతే ఏం చేయలేడేమో కానీ ఒక్కసారి తన దృష్టికి వచ్చిందంటే మాత్రం కచ్చితంగా వాళ్లను ఆదుకుంటాడు రజినీ. అలా ఎన్నో సార్లు చేసి చూపించాడు కూడా.

వాళ్ల కోసం ఈయన కూడా ఏదైనా చేస్తుంటాడు. ఎవరైనా అభిమాని కష్టంలో ఉంటే వెంటనే స్పందించి సాయం చేస్తుంటాడు సూపర్ స్టార్. తన వరకు రాకపోతే ఏం చేయలేడేమో కానీ ఒక్కసారి తన దృష్టికి వచ్చిందంటే మాత్రం కచ్చితంగా వాళ్లను ఆదుకుంటాడు రజినీ. అలా ఎన్నో సార్లు చేసి చూపించాడు కూడా.

రజినీకాంత్ దర్బార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసందని నిర్మాత చెప్పారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడ్డెక్కారు.

రజినీకాంత్ సినిమా బాగుందని టాక్ వస్తే చాలు... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు ఊహించని లాభాలు వచ్చేస్తాయి. కలెక్షన్లపరంగా సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. సినిమా ఓకే అనేలా ఉన్నా... డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం నష్టాలతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. రజినీకాంత్ నయా మూవీ దర్బార్ విషయంలో సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. దర్బార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసందని నిర్మాత చెప్పారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడ్డెక్కారు. దర్బార్ చిత్రంతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయితే రజినీకాంత్ సినిమా విషయంలో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ బాబా చిత్రంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో రజనీ కొంతమేర వారిని ఆదుకున్నాడు. ఇంతకుముందు రజనీ లింగ సినిమాకు కూడా బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇప్పుడు దర్బార్‌ విషయంలో అలాగే జరిగింది. దీంతో ఈ సారి రజినీకాంత్ ఏ రకంగా స్పందిస్తారు ? డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో కొంత తిరిగి ఇస్తారా ? అన్నది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Darbar, Rajinikanth