రజనీకాంత్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ సినిమా 'దర్బార్' జనవరి 9న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా తెలుగులో కంటే తమిళ్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. కారణం అక్కడ ఏ సినిమా రజనీకి పోటీగా రాకపోవడం. ఈ నేపథ్యంలోనే రజనీ సినిమా దర్బార్‌కు పోటీగా ధనుష్ దిగాడు. ధనుష్ కొత్త సినిమా 'పట్టాస్' ఈ నెల 15వ తేదీన విడుదలై అదిరిపోయే టాక్‌తో వసూళ్లపరంగా తమిళనాట దుమ్మురేపేస్తోంది. పట్టాస్‌ను దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ధనుష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. అయితే మామ రజనీకాంత్ సినిమా కంటే ధనుష్ సినిమా బెటర్ టాక్ తెచ్చుకోవడంతో 'దర్బార్' వసూళ్లకు గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రభావం వీకెండ్ లో మరింతగా కనిపించే అవకాశం ఉందని, దర్బార్ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు సినీ పండితులు. కాగా ధనుష్ ఇంతకు ముందు అసురన్ అంటూ గ్రామీణ నేపథ్యంలో వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 2019లో బిగ్గెస్ట్ బ్లాస్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా వచ్చిన ఈ పట్టాస్ కూడా గ్రామీణ నేపథ్యంతో కూడిన కథా కథనాలలతో పాటు ధనుష్ ద్విపాత్రాభినయం ఆకట్టుకోవడం దర్బార్ కలెక్షన్స్‌ను దెబ్బకొడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.