రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ దర్బార్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా మొదటనుండి పాజిటివ్ టాక్‌తోనే దూసుకెళ్తుంది. రజనీకాంత్‌తో రోబో చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దర్బార్ 4 రోజుల్లో 7.57 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 3.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక తమిళనాట 3వ రోజున అంటే జనవరి 11వ తేదీన ఒక్క రోజునే ఈ సినిమా 30 కోట్లను వసూలు చేయడం రికార్డ్‌గా మారింది. దీంతో ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నాలుగు రోజుల్లోనే దర్బార్ అక్కడ లాభాల బాట పట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన మొదటి పాన్ ఇండియన్ మూవీ. దర్బార్ మొదటి ఐదు రోజులకుగాను రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ లైకా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుందంటూ రాసుకుంది. దర్బార్‌లో రజనీకి జోడిగా నయనతార నటించగా మరో కీలక పాత్రలో హిందీ నటుడు సునీల్ శెట్టి నటించాడు.
Here's the Worldwide Box-office collections of #DARBAR
"Anyone can play the game, but the throne always belongs to the EMPEROR 👑"@rajinikanth @ARMurugadoss #Nayanthara @anirudhofficial @santoshsivan @sreekar_prasad #Santhanam @SunielVShetty #DarbarPongal #DarbarBlockbuster pic.twitter.com/f2z0MGlzVv
— Lyca Productions (@LycaProductions) January 13, 2020
శ్రద్ధా కపూర్ అదిరిపోయే పిక్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Rajinikanth