• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJINIKANTH COMPLETES ANNAATTHE SHOOTING LEAVES HYDERABAD HERE ARE THE DETAILS SR

Rajinikanth: అన్నాత్తే టీమ్‌కు గుడ్‌బాయ్ చెప్పిన రజనీకాంత్.. చెన్నైకి పయనం..

Rajinikanth: అన్నాత్తే టీమ్‌కు గుడ్‌బాయ్ చెప్పిన రజనీకాంత్.. చెన్నైకి పయనం..

రజినీకాంత్ Photo : Twitter

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ప్రతిసారి ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఓ సారి టీమ్‌లో కోవిడ్ వస్తే.. మరోసారి రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చిత్రబ‌ృందం ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను జరపడానికి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌లో రజనీకాంత్ కూడా పాల్గోన్నారు. 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. కాగా నిన్నటితో రజనీకాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో ఆయన చెన్నైకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కూడా రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్‌లో అన్నాత్తే చిత్రం కోసం 35 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గోన్నారు. తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇక తాజాగా సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో ఆయన మంగళవారం చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే అన్నాత్తే షూటింగ్ పూర్తవుతుందట.

    ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు.

    ఇక ఈసినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

    Darbar movie piracy version telecast in a Channel in Tamil Nadu and case filed by Lyca Productions pk రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ దర్బార్‌. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. Darbar movie piracy,Darbar movie piracy version,Darbar movie piracy rajinikanth,Darbar movie,Darbar movie collections,rajinikanth darbar movie,telugu cinema,దర్బార్,దర్బార్ సినిమా,దర్బార్ పైరసీ,దర్బార్ పైరసీ వర్షన్ టీవీలో
    రజినీకాంత్ (Twitter/Photo)


    ఈ సినిమా గురించి మరో విశేషం ఏమంటే.. మామూలుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలి‌లో యాక్టింగ్ చేస్తూ.. రజనీ పలికి సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్‌ సినిమా డైలాగ్స్‌ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు. కాగా రజనీ ఈ ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నాడట. ఇక ఈ సినిమాలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తిసురేష్‌‌లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటించబోతున్నారు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అన్నాత్తే నవంబర్ 4 న విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: