• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJINIKANTH BEAR GRYLLS LATEST TV SHOW MAN VS WILD ADVENTURE PROGRAMME CREATES NEW RECORDS TA

రజినీకాంత్ తెరపైనే కాదు.. అక్కడ కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు..

రజినీకాంత్ తెరపైనే కాదు.. అక్కడ కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు..

సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో రజినీకాంత్ (Facebook/Photo)

సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటి అసలు సిసలు సూపర్ స్టార్‌గా తన సత్తా ఏంటో చూపెట్టారు.

  • Share this:
    సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటి అసలు సిసలు సూపర్ స్టార్‌గా తన సత్తా ఏంటో చూపెట్టారు. తాజాగా ఈయన బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో లకిసి ‘ఇన్ టూది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్’ అనే ప్రోగ్రామ్‌ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన షూటింగ్ కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ ఫారెస్ట్‌లో జరిగింది. ఈ షూటింగ్ సందర్భంగా  రజినీకాంత్ గాయాలపాలైయిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రోగ్రామ్ గత నెల 23 న రాత్రి 8 గంటలకు డిస్కవరి చానెల్‌లో ప్రసారమైంది. ఈ షోకు ఈ యేడాదిలోనే అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా, అదే విధంగా రియాలిలీ షో చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన ప్రోగ్రామ్‌గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

    రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)
    రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)


    ఇన్ టూ ది వైల్ట్ బియర్ గ్రిల్స్ షోను బార్క్ ఇండియా లెక్క ప్రకారం సుమారు 12.4 మిలియన్ల మంది ఈ ప్రోగ్రామ్‌ను చూసినట్టు చెబుతున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు డిస్కవరి చానెల్‌లో 12 భాషల్లో ప్రసారం అయింది. ఈ ప్రోగ్రామ్‌ను తమిళనాడులో ఎక్కువ మంది చూసారు. ఇక రజినీకాంత్ దెబ్బకు ఆ సమయంలో ప్రసారమయ్యే మహా మహా టీవీ సిరీయల్స్ అన్ని బొక్కా బోర్లా పడ్డాయి. ఏమైనా తలైవా రేంజ్ ఏంటో ఈ ప్రోగ్రామ్ చూపించింది. ప్రస్తుతం రజినీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్త’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: