హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్ బ్యాక్ టూ వర్క్.. చెన్నైలో ‘అన్నాత్తే’ షూటింగ్ స్టార్ట్ చేసిన తలైవా..

Rajinikanth: రజినీకాంత్ బ్యాక్ టూ వర్క్.. చెన్నైలో ‘అన్నాత్తే’ షూటింగ్ స్టార్ట్ చేసిన తలైవా..

రజనీకాంత్ (File Image)

రజనీకాంత్ (File Image)

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ చెన్నైలో మొదలుపెట్టారు.

  Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే హైదారాబాద్ 35 రోజుల పాటు కీలక షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై వెళ్లారు రజినీకాంత్. ఆ తర్వాత అటు నుంచి చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. రీసెంట్‌గా చెన్నై తిరిగి వచ్చిన రజినీకాంత్.. తన  రజినీ మక్కల్ కట్చి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రజినీకాంత్ చేస్తోన్న ‘అన్నాత్తే’ విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా  ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ జరగలేదు. దీంతో చెన్నైలోని ఓ స్టూడియోలో  ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

  చెన్నై షెడ్యూల్లో రజినీకాంత్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత కోల్‌కతాలో మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయనున్నారు. అక్కడే పది రోజుల పాటు షూటింగ్ చేస్తే ఈ సినిమా కంప్లీట్ అవుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మీనా, కుష్బూ నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజు, సత్యదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

  ‘అన్నాత్తే’ మూవీ (Twitter/Photo)

  ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈసినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో ‘అన్నాత్తే’ మూవీకి ‘అన్నయ్య’ లేదా ‘పెద్దన్నయ్య’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.  సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్  నిర్మిస్తున్నారు. ఇక ‘అన్నాత్తే’ సినిమాను  నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Annaatthe Movie, Keerthy Suresh, Kollywood, Kushboo, Meena, Rajinikanth

  ఉత్తమ కథలు