RAJINIKANTH ANNAATTHE TELUGU RIGHTS SOLD WHOPPING PRICE HERE ARE THE DETAILS TA
Rajinikanth - Annaatthe : రజినీకాంత్ ‘అన్నాత్తే’ తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఇంతకీ ఎంతంటే..
’అన్నాత్తే’ గా రజినీకాంత్ (Rajinikanth | Annaatthe First Look Photo : Twitter)
Rajinikanth - Annaatthe : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.
Rajinikanth - Annaatthe : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనుంది. అంతేకాదు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పైగా కరోనా ఎఫెక్ట్‌తో ఈ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు.
కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజు, సత్యదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చారు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలరు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలరు.
దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో ‘అన్నాత్తే’ మూవీకి ‘అన్నయ్య’ లేదా ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. లేకపోతే.. ప్రజల్లో బాగా ఫేమసైన ‘అన్నాత్తే’ టైటిల్‌తోనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తారా అనేది చూడాలి. ఈ చిత్రంలో రజనీకాంత్ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.