Home /News /movies /

Rajinikanth - Kushboo: సూపర్ స్టార్ రజినీకాంత్ ’అన్నాత్తే’ డబ్బింగ్ పూర్తి చేసిన కుష్బూ..

Rajinikanth - Kushboo: సూపర్ స్టార్ రజినీకాంత్ ’అన్నాత్తే’ డబ్బింగ్ పూర్తి చేసిన కుష్బూ..

రజినీకాంత్, కుష్బూ (File/Photo)

రజినీకాంత్, కుష్బూ (File/Photo)

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ను కుష్బూ పూర్తి చేసుకుంది.

    Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటైంది. దీంతో రజినీకాంత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న మీనా కూడా డబ్బింగ్ పూర్తి చేసేసింది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోన్న కుష్బూ కూడా తన క్యారెక్టర్‌కు సంబంధించిన పనిని పూర్తి చేసిందని చెన్నై మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమాలో ప్రధాన తారాగణం తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్టు అయింది. రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. రీసెంట్‌గా  హైదారాబా‌ద్‌లో  35 రోజుల పాటు కీలక షెడ్యూల్ పూర్తి చేసారు. అటు చెన్నైలో కూడా ఈ సినిమా టాకీ పార్ట్  పూర్తైయింది. కలకత్తాలో ఓ పాటను చిత్రకరించనున్నారు.

    ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మీనా, కుష్బూ నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజు, సత్యదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

    ‘అన్నాత్తే’ మూవీ (Twitter/Photo)


    ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చారు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలరు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలరు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో ‘అన్నాత్తే’ మూవీకి ‘అన్నయ్య’ లేదా ‘పెద్దన్నయ్య’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.  సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్  నిర్మిస్తున్నారు. ఇక ‘అన్నాత్తే’ సినిమాను  నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    ఇవి కూడా చదవండి.. 

    నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..


    నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

    ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?

    Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ ఫిట్నెస్ మంత్ర.. యోగాసనాలతో చిల్ చేస్తోన్న ఎఫ్ 3 భామ..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Annaatthe Movie, Kollywood, Kushboo, Meena, Rajinikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు