Rajinikanth | Annaatthe First Look : పట్టు పంచెలో దసరాబుల్లోడిలా రజనీకాంత్.. అదిరిన ఫస్ట్ లుక్...

Rajinikanth | Annaatthe First Look Photo : Twitter

Rajinikanth | Annaatthe First Look : శివ దర్శకత్వంలో రజనీకాంత్ అన్నాత్తే అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి రజనీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్‌లో రజనీకాంత్ పట్టు పంచలో దసరాబుల్లోడిలా అదరగొట్టారు.

  • Share this:
    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనేక ఆవాంతరాల మధ్య ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇక అది అలా ఉంటే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 11గంటలకు విడుదల చేశారు. ఎప్పటిలాగే రజనీ పంచకట్టులో దసరాబుల్లోడులా అదరగొడుతున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

    శివ రజనీకాంత్  (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా నుంచి సాయంత్రం ఆరుగంటలకు అదిరేపోయే మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా టీమ్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ 4 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.


    ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు.

    ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే.. మామూలుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలి‌లో యాక్టింగ్ చేస్తూ రజనీ పలికే సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్‌ సినిమా డైలాగ్స్‌ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు.

    కాగా రజనీ ఈ సినిమా కోసం సొంతంగా సంభాషణలు రాశారట. ఇక ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార (Nayanthara) కీర్తిసురేష్‌‌ లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటించారు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం.

    ఈ సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అన్నాత్తే నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: