తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే' సినిమా షూటింగ్ కోసం ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈసినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాల్లో శివ అజిత్‌ను ఓ లేవల్లో చూపిస్తూ అదరగొట్టాడు. కాబట్టి ప్రస్తుతం రజనీతో చేస్తోన్న ఈ సినిమాలో శివ.. సూపర్ స్టార్‌ను ఏవిధంగా చూపిస్తాడో.. అని తెగ ఆసక్తితో చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా గురించి మరో విశేషం ఏమంటే.. మామూలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ.. రజనీ పలికి సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్ సినిమా డైలాగ్స్ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు. కాగా రజనీ తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నాడని సమాచారం. శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తే’ కోసం రజనీ ఈ ప్రయోగం చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తిసురేష్‌లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించబోతున్నాడు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం.
#SuperstarRajinikanth leaves to Hyderabad for #Annaatthe shoot @rajinikanth @directorsiva @sunpictures pic.twitter.com/FJpP3NFBHb
— BARaju (@baraju_SuperHit) December 13, 2020
ఈ సినిమాలో రజనీకాంత్ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకు తగ్గట్లుగా రజనీ పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతాడట. ఈ సినిమాలో రజనీ పాత్ర చాలా బాగుంటుందట. ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చడంతో సంభాషణల్ని తానే స్వయంగా రాస్తానని చిత్ర బృందానికి తెలియజేశాడట. దీంతో దర్శకుడు శివ కూడా ఓకే చెప్పడంతో రజనీకాంత్ ఇప్పటికే డైలాగ్స్ రాయడం కూడా మొదలు పెట్టాడట. ఇక ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ఈయన ఇటీవల ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యలో నటించి అదరగొట్టాడు. ఇక ఇటీవల రజనీకాంత్ నటించిన పేట, దర్భార్ లాంటీ సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో రజనీకాంత్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి మరి శివ రజనీకాంత్‌కు ఏ రేంజ్లో హిట్ ఇస్తాడో.. రజినీకాంత్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో కీర్తీ సురేష్, నయనతార, మీనా, కుష్భూ నటిస్తున్నారు. అన్నాత్తేను 2021 పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth