RAJINIKANTH ALL SET TO COME FOR SHOOT OF SIVA ANNAATTHE MOVIE IN FEBRUARY THIRD WEEK PK
Rajinikanth: మళ్లీ షూటింగ్కు రజినీకాంత్.. ఊపిరి పీల్చుకుంటున్న దర్శక నిర్మాతలు..
రజినీకాంత్ (Rajinikanth)
Rajinikanth: రజినీకాంత్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగానే ఉన్నాడు. అనారోగ్యం కారణంగా ఈయన ఒప్పుకున్న అన్నాత్తే షూటింగ్ కూడా ఆగిపోయింది. హైదరాబాద్లోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేరుగా చెన్నై వెళ్ళిన రజినీ.. అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.
రజినీకాంత్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగానే ఉన్నాడు. అనారోగ్యం కారణంగా ఈయన ఒప్పుకున్న అన్నాత్తే షూటింగ్ కూడా ఆగిపోయింది. హైదరాబాద్లోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేరుగా చెన్నై వెళ్ళిన రజినీ.. అక్కడే రెస్ట్ తీసుకున్నాడు. కొన్ని రోజులుగా ఈయన అస్సలు బయటికి రావడం లేదు. శివ దర్శకత్వంలో ఈయన ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. నయనతార ఇందులో రజినీకాంత్కు జోడీగా నటిస్తుంది. మొన్నటి వరకు హైదరాబాద్లోనే మెయిన్ షెడ్యూల్ చిత్రీకరించాడు దర్శకుడు శివ. అయితే ఉన్నట్లుండి అనారోగ్యం పాలు కావడంతో వెంటనే ప్యాకప్ చెప్పేసాడు. ఈ అనారోగ్యం కారణంగానే రాజకీయాలకు కూడా పూర్తిగా సెలవిచ్చేసాడు రజినీకాంత్. తాను ప్రస్తుతం పాలిటిక్స్ చేయలేనంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్. ఈ మధ్యే అన్నాత్తే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. నిజానికి ఈ సినిమా కొన్ని రోజుల పాటు ఆగిపోయిందని.. ఇప్పట్లో విడుదల కూడా కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్నట్లుగానే సమ్మర్లో వస్తుందనుకున్న సినిమా కాస్తా ఏడాది చివర్లోకి వెళ్లిపోయింది. నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. దీవాళి కానుగకా ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.
రజినీకాంత్ శివ (Rajinikanth Siva)
సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, సిమ్రాన్ కూడా నటిస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన విజయం లేని రజినీకాంత్.. ఈ మాస్ సినిమాతో కచ్చితంగా సంచలనం సృష్టిస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. మరోవైపు ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు.
రజినీకాంత్ శివ (Rajinikanth Siva)
అందులో మొదటి పాటను బాలుతో పాడించాడు. ఈ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి మూడో వారం నుంచి షూటింగ్కు రాబోతున్నాడు రజినీకాంత్. దాంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మిగిలిన భాగం కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఏదేమైనా రజినీ మళ్లీ షూటింగ్కు వస్తుండటంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.