మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన రజినీకాంత్ రోబో సీక్వెల్ ‘2.O’

Rajinikanth 2.O | సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రోబో సీక్వెల్  ‘2.O’ కలెక్షన్ల పరంగానే కాకుండా...అవార్డుల పరంగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 20, 2019, 1:28 PM IST
మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన రజినీకాంత్ రోబో సీక్వెల్ ‘2.O’
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘2.O’ సినిమా బాలీవుడ్‌లో రూ.100 కోట్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రోబో సీక్వెల్  ‘2.O’ కలెక్షన్ల పరంగానే కాకుండా...అవార్డుల పరంగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. తమిళం, హిందీలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో మాత్రం అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది.

తాజాగా రోబో 2.O సినిమా ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ రీల్ అవార్డ్‌కు నామినేట్ అయింది. ఈ విషయాన్ని 2.O సినిమాకు    సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసిన రసూల్ పొకుట్టి తెలిపారు. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 2.O ఈ నామినేషన్ దక్కించుకున్నట్టు తెలిపారు.

ఈ అవార్డు ఫంక్షన్‌ను ఫిబ్రవరి 17 లాస్ ఏంజిల్స్ వేదికగా ఘనంగా జరగనుంది. ఈ అవార్డ్స్ లిస్ట్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పలు చిత్రాలు పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. వాల్డ్ వైడ్‌గా సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 3D ఫార్మాట్‌లో 4D ఎస్ఎల్ఆర్ సౌండ్ సిస్టంలో రోబో 2.0 తెరకెక్కడం విశేషం.

పూనమ్ పాండే హాట్ ఫోటో


ఇవి కూడా చదవండి 

ప్రభాస్ డైరెక్టర్‌తో..రజినీకాంత్ లాస్ట్ మూవీ..?'జస్ట్ వన్ థింగ్' అంటున్న ప్రియాంకా చోప్రా... వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ

ఆ స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ నిజమేనా..
First published: January 20, 2019, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading