రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రజినీకాంత్ ‘2.O’

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీని ఎనిమిదో రోజుకు రూ.500 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు ఈ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

news18-telugu
Updated: December 6, 2018, 9:48 PM IST
రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రజినీకాంత్ ‘2.O’
రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన 2.O
  • Share this:
శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డేనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసింది.అంతేకాదు విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కలెక్ట్ చేసింది.

తాజాగా ఈ మూవీని ఎనిమిదో రోజుకు రూ.500 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు ఈ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. తెలుగు వెర్షన్ 7 రోజుల్లో రూ.80 కోట్ల గ్రాస్...రూ.40 కోట్ల షేర్ రాబట్టింది. హిందీ వెర్షన్ మాత్రం రూ.130 కోట్ల గ్రాస్..60 షేర్ తీసుకొచ్చింది. ఈ మూవీని వచ్చే యేడాది చైనాలో దాదాపు 56 వేల స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. అందుకోసం చైనాలో కొన్ని థియేటర్స్‌ను 3Dలోకి మార్చనున్నారు.

మరోవైపు ఈ మూవీలో లాస్ట్‌లో చిట్టి2.O పోటిగా చిన్ని వెర్షన్ 3.0 అంటూ రజినీకాంత్ చేసిన హంగామా మాములుగా లేదు. ఇపుడు ఈ మూవీకి సంబంధించిన మూడో సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు దర్శకుడు శంకర్...ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టోటల్‌గా ‘2.O’ కలెక్షన్లు..అటు శంకర్ కెరీర్‌తో పాటు హీరోలు రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.


ఇది కూడా చదవండి 

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫసక్: ప్రజలకు రాజమౌళి సందేశం

‘2.0’ ఫస్ట్ వీక్ క‌లెక్ష‌న్స్.. నైజాంలో నాన్ బాహుబ‌లి రికార్డ్..రజినీకాంత్‌కు బర్త్ డే కానుక ఇస్తోన్న వెంకటేశ్

 
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading