4 రోజుల్లో రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ‘2.O’ : దటీజ్ రజినీకాంత్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది.ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి ‘2.O’ మూవీ నాలుగు రోజులకు కలిపి రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు లైకా ప్రొడక్షన్ వాళ్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

news18-telugu
Updated: December 3, 2018, 4:22 PM IST
4 రోజుల్లో రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ‘2.O’ : దటీజ్ రజినీకాంత్
రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన 2.O మూవీ
  • Share this:
శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డేనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసింది.

విజువల్ పరంగా నభూతో అన్న విధంగా ఉన్న ‘2.O’ మూవీ..కథ పరంగా చాలా వీక్‌గా ఉందంటున్నారు చూసిన జనాలు. మాంత్రికుడు లేకుండా..ఒక అతీత శక్తిని ఒక రోబో ఎలా ఎదుర్కొందో అనేదే  ‘2.O’ స్టోరీ. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.12.53 కోట్లు రాబట్టిన ఈ మూవీని..నాలుగు రోజులకు కాను 33 కోట్ల షేర్‌ వసూలు చేసిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో రూ.29 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే...దాదాపు రూ.100 కోట్ల గ్రాస్...47 కోట్ల షేర్  వసూలు చేసినట్టు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు.
విదేశాల్లో ఈ మూవీ రూ.11 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి ‘2.O’ మూవీ నాలుగు రోజులకు కలిపి రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు లైకా ప్రొడక్షన్ వాళ్లు అఫీషియల్‌గా ప్రకటించారు.మొత్తానికి గురు, శుక్రవారాల్లో నెమ్మదిగా ఉన్న ‘2.O’ బాక్సాఫీస్ కలెక్షన్స్ శని, ఆది వారాల్లో పుంజుకున్నాయి. ఓవరాల్‌గా 2.0 మూవీ తెలుగులో హిట్టు అనిపించుకోవాలంటే ఇంకా రూ.40 కోట్ల షేర్ రాబట్టాలి. చూడాలిక. ముందు ముందు  టాలీవుడ్‌ బాక్సాఫీస్ దగ్గర ‘2.O’ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.


ఇది కూడా చదవండి 

‘2.0’ క‌లెక్ష‌న్స్ దాచేస్తున్నారా.. ర‌జినీకాంత్ సినిమాకు ఏంటీ దాప‌రికం..?

రజినీకాంత్‌కు ‘2.0’ షాక్.. నెం.1 చైర్‌కు విజయ్ చెక్..

‘సింబా’ ట్రైలర్ టాక్..‘టెంపర్’ చూపించిన రణ్‌వీర్ సింగ్
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2018, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading