Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స

Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స

రజినీకాంత్

రజినీకాంత్

Rajinikanth: కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు.

ఇంకా చదవండి ...

సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కాసేపటి క్రితం అపోలో యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలులేవని.. హైబీపీతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని.. బీపీలో హెచ్చుతగ్గులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అపోలో డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది.


ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. మీనా, కుష్బూ, ప్రకాశ్ రాజ్, జాకీ ష్రాఫ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని.. సన్ పిక్చర్స్ అన్నాత్తే మూవీని నిర్మిస్తోంది. డి. ఇమ్మన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ కరోనా కారణంగా చాలా రోజుల పాటు షూటింగ్‌కు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం, షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతివ్వడంత.. అన్నాత్తే చిత్రీకరణ మళ్లీ పట్టాలెక్కింది. ఐతే మూవీ యూనిట్‌లో కొందరికి కరోనా రావడం, ఇప్పుడు రజినీకాంత్ అనారోగ్యానికి గురవడంతో.. అన్నాత్తే షూటింగ్‌కు మరోసారి బ్రేకులు పడ్డాయి.

మరోవైపు తమిళనాడులో రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్నారు రజినీకాంత్. త్వరలోనే పార్టీని ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, గుర్తులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందని.. వచ్చే ఏడాది శుభవార్త చెబుతాడని తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అనారోగ్యానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన త్వరగా కోలుకొని..రాజకీయ అరంగ్రేటం చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

First published:

Tags: Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు