HOME »NEWS »MOVIE »rajinikanth accused of promoting enmity warned with protests after slipper comment on periyar sr

రజనీకాంత్ వివాదస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు..

రజనీకాంత్ వివాదస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు..
రజినీకాంత్ (File/Rajinikanth)

సూపర్ స్టార్ రజనీకాంత్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదయ్యింది.

  • Share this:
    సూపర్ స్టార్ రజనీకాంత్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదయ్యింది. ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇబ్బందుల్లో పడేశాయి. వివరాల్లోకి వెళితే జనవరి నెల 14 న జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. దీంతో రజనీకాంత్‌.. పెరియార్‌ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రజనీ.. రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:January 19, 2020, 09:53 IST