హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth 169 Movie : సంచలన దర్శకుడితో రజినీకాంత్ 169వ మూవీ.. అధికారిక ప్రకటన..

Rajinikanth 169 Movie : సంచలన దర్శకుడితో రజినీకాంత్ 169వ మూవీ.. అధికారిక ప్రకటన..

Rajinikanth 169 Movie : గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. పెద్దన్న తర్వాత మరో సంచలన దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

  Rajinikanth 169 Movie : గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. రాను రాను తెలుగులో తలైవా సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది. ఈయన వెరైటీ స్టోరీలు కాకుండా రొటీన్ మాస్ సినిమాలతో పలకరిస్తోన్న రజినీకాంత్ సినిమాలపై ఒకప్పటిలా ఆకట్టుకోవడం లేదు. ‘రోబో’ తర్వాత తెలుగులో తలైవా ఏ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేదు.  గతేడాది దీపావళి కానుకగా విడుదలైన  ‘పెద్దన్న’ మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఇక ఈ సినిమా తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్‌ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. శివ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్‌లో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. అంతేకాదు అక్కడ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర పర్పామ్ చేయలేదు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయింది.

  ’పెద్దన్న’ సినిమా షూటింగ్ సమయంలో ఈయన అనారోగ్యం పాలైయ్యారు. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా టైమే తీసుకుని పూర్తి చేసారు.  అనారోగ్యం కారణంగా సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పట్లో సినిమాల వైపు రారనే  ప్రచారం కూడా బాగానే జరిగింది. ఈ వార్తలు విన్న తర్వాత రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. ఓ వైపు అనారోగ్యం వెంటాడుతున్న మరోవైపు వరుసగా కమిట్‌మెంట్స్ ఇస్తున్నారు రజినీకాంత్.

  Mohan Babu - Son Of India Trailer Talk : మోహన్‌ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..

  ఇదిలా ఉంటే పెద్దన్న తర్వాత తాజాగా ఈయన వరుసగా తమిళంలో ‘కొలమావు కోకిల’, ‘వరుణ్ డాక్టర్’ తాజాగా విజయ్‌తో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విజయ్‌తో చేస్తోన్న ‘బీస్ట్’ మూవీ కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ 169వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

  కొన్నేళ్లుగా రజినీకాంత్ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. పా రంజిత్, శివ, కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడు రజినీకాంత్. తాజాగా ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా  11 ఏళ్ల కింద వచ్చిన రోబో తర్వాత రజనీకాంత్ కు సరైన విజయం లేదు. ఈ లోటు నెల్సన్ అయినా తీరుస్తాడని ఆశిస్తున్నారు రజనీకాంత్ అభిమానులు.

  First published:

  Tags: Kollywood, Nelson Dilipkumar, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు