రజినీ కాంత్ మరో అరుదైన రికార్డు

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లున్నారు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఒక్కరే. ఆయనే ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. తాజాగా ‘2.O’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. తాజాగా ఈ మూవీతో రజినీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

news18-telugu
Updated: November 30, 2018, 1:44 PM IST
రజినీ కాంత్ మరో అరుదైన రికార్డు
రజినీకాంత్ (ఫైల్)
  • Share this:
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లున్నారు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఒక్కరే. ఆయనే ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. హీరోలు ఎంతమంది ఉన్నా రజనీకాంత్‌కు  ఉండే క్రేజే వేరు. ఆయన పేరుకున్న ఛరిష్మా, ఆ పవర్ ఏ హీరోకి లేదు. సినీవినిలాకాశంలో నల్లని చంద్రుడు ఈ కాలా.

అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల కబాలి. అందుకే బాలీవుడ్ టూ హలీవుడ్ వరకు రజినీకాంత్ కు ఉండే క్రేజే వేరు.తాజాగా ‘2.O’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. తాజాగా ఈ మూవీతో రజినీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

రజినీకాంత్ 2.O


బ్లాక్ అండ్ వైట్ సినిమాతో ప్రారంభమైన రజినీకాంత్ నట ప్రస్థానం..నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఈ మజిలీలో సూపర్ స్టార్..ఎన్నోకలర్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ‘కొచ్చాడయాన్’ అనే యానిమేటడ్ మూవీలోను రజినీ నటించాడు.

తాజాగా 2‘.O’మూవీతో తొలిసారి త్రీడి మూవీలో దర్శనమిచ్చాడు. ఇలా బ్లాక్ అండ్ వైట్, కలర్, యానిమేటెడ్, త్రీడీ..ఇలా నాలుగు రకాల సినిమాల్లోనటించిన కథానాయకుడు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎవరు లేరని తలైవా ఫ్యాన్స్ బల్ల గుద్ది మరి చెబుతున్నారు. అంతేకాదు ఈ అరుదైన ఘట్టాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమైనా కథానాయకుడిగా రజినీ రికార్డు చూసి తలైవా ఫ్యాన్స్ లుంగీ డ్యాన్స్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 30, 2018, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading