రజినీకాంత్, శంకర్ 2.O ఫస్ట్ డే కలెక్షన్స్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 30, 2018, 1:20 PM IST
రజినీకాంత్, శంకర్ 2.O ఫస్ట్ డే కలెక్షన్స్
2.O ఫస్ట్ డే కలెక్షన్స్
  • Share this:
శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘2.O’ విడుదలైన ప్రతి చోట ప్రభంజాన్ని సృష్టిస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. హిందీ వెర్షన్ రూ.23 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నైజాంలో ఈ మూవీని దాదాపు రూ.5 కోట్లు షేర్ రాబట్టినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో ఈ మూవీ రూ.7.50 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓవరాల్‌గా రూ. 12.53 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

2.O మూవీ పోస్టర్


మరోవైపు కర్ణాటకలో రూ.8.25కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. మరోవైపు చెన్నైలో రూ.2.64 కోట్ల గ్రాస్‌తో ‘సర్కార్’ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండే. ఆ రికార్డ్‌ను 2.O క్రాస్ చేసినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ మూవీ చెన్నైలో మొదటి రోజు రూ.2.37 కోట్లు రాబట్టినట్టు సమాచారం.

2.Oలో అమీ జాక్సన్, రజినీకాంత్


ఓవర్సీస్‌లో యూఎస్, బ్రిటన్ సహా పలు దేశాల్లో ఈ మూవీ ప్రీమియర్లతో కలిపి 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజువల్ పరంగా నభూతో అన్న విధంగా ఉన్న ‘2.O’ మూవీ..కథ పరంగా చాలా వీక్‌గా ఉందని చాలా మంది విశ్లేశిస్తున్నారు. దాదాపు తెలుగులో రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 2.O మూవీ భవితవ్యం తేలాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సందే.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 30, 2018, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading