హోమ్ /వార్తలు /సినిమా /

శాసనసభ: ఇది నా దశాబ్దాల నట జీవితంలో చూసిన అనుభవం.. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

శాసనసభ: ఇది నా దశాబ్దాల నట జీవితంలో చూసిన అనుభవం.. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

Rajendra prasad (Photo Twitter)

Rajendra prasad (Photo Twitter)

Rajendra Prasad: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ హీరో హీరోయిన్లుగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా శాసనసభ. ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), సోనియా అగర్వాల్ (Sonia Agerwal), పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ హీరో హీరోయిన్లుగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా శాసనసభ (Shasanasabha). సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా కథ, మాటలు అందించిన రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రంలో హీరో ఇంద్రసేనకు మంచి పేరొచ్చింది. నారాయణ స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ప్రధాన ఆకర్షణ అవుతోంది. ఆయన ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడమే సగం విజయంగా భావించాం. ఇవాళ మా నమ్మకం నిజమైంది అన్నారు.

దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ.. ఇంద్రసేనను యాక్షన్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నించాను. మేము ఆశించిన ఫలితం దక్కింది. ఇంద్రసేన యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. చిత్రీకరణ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు ఇచ్చిన సహకారం మర్చిపోలేను అన్నారు.

నటుడు భూషణ్ మాట్లాడుతూ.. సినిమా ద్వారా మేము కోరుకునేది గుర్తింపు. ఆ గుర్తింపుతో మరికొన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తాం. ఈ సినిమా ద్వారా నాకు శాసనసభ నటుడిగా పేరొచ్చింది. ఇవాళే నేను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభించాం అన్నారు.

హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. మన సినిమా మనం బాగుందంటే కాదు, మనకు తెలిసిన వాళ్లు చెబితే కాదు బయట వాళ్లు చూసి చెప్పినప్పుడు నిజమైన సంతోషం కలుగుతుంది. ఇవాళ నాకు తెలియని వారెవరో ఫోన్స్ చేసి సినిమా చూశాం బాగుందని అంటున్నారు. ఇలా ప్రేక్షకుల మౌత్ టాక్ వల్ల మా చిత్రానికి వసూళ్లు పెరుగుతున్నాయి. రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులు వదులుకోరు తప్పకుండా ఆదరిస్తారు. ఇది నా దశాబ్దాల నట జీవితంలో చూసిన అనుభవం. ఈ చిత్రానికి విడుదలైన మూడో రోజున 60 థియేటర్స్ పెరిగాయంటే ఊరికే కాదు కదా. సినిమా అందరికీ నచ్చితేనే థియేటర్స్ పెంచుతారు. నారాయణ స్వామి పాత్రలో నా నటనకు పేరొచ్చిందంటే దానికి మొదటి కారణం రచయత, తర్వాత దర్శకుడు క్రెడిట్ లో మూడో స్థానం నాది. వీళ్లు సహకరించడం వల్లే అంత బాగా నటించాను. ఇంద్రసేన నన్నెంతో అభిమానిస్తాడు. ఆయన కొడుకుతో ఈ చిత్రంలో నటించాను. ఈ సినిమాను తప్పకుండా చూడండి అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అనీష్ కురువిల్లా, అమిత్, దిల్ రమేష్, సినిమాటోగ్రాఫర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Rajendra Prasad, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు