Home /News /movies /

RAJENDRA PRASAD ROLE IN SHASANASABHA MOVIE SLB

Shasanasabha: శాసనసభలో రాజేంద్రప్రసాద్.. నటకిరీటి పోస్టర్ వైరల్

Photo Twitter

Photo Twitter

Rajendra Prasad: ఈ క్రమంలోనే సీనియర్ హీరో, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాసనసభ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తమ సినిమా వైపు జనం చూపు పడేలా చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. పలువురు టాలీవుడ్ సీనియర్, జూనియర్ దర్శకనిర్మాతలు తమ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాసనసభ (Shasanasabha) సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తమ సినిమా వైపు జనం చూపు పడేలా చేస్తున్నారు. ఎమ్మేల్యే నారాయణ స్వామిగా డా.రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) నటిస్తుండగా.. తాజాగా ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు.

శాసనసభ సినిమా నుంచి రాజేంద్రప్రసాద్ లుక్ వదులుతూ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మేకర్స్. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గారు ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. చిత్రం కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అని అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు రాఘవేందర్ రెడ్డి అందించగా.. మురళీకృష్ణ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Rajendra Prasad, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు