ఎఫ్3 సక్సెస్ మీట్ కార్యక్రమానికి సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అయితే ఆయన స్టేజ్ మీదకు మాట్లాడేందుకు వచ్చే ముందు ఆయనకు సంబంధించిన ఏవీ ఒకటి స్టేజ్ పై ప్లే చేశారు. అందులో .. ఎఫ్3లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన కీలక కామెంట్స్‌ను ప్లే చేశారు. ఎఫ్3 సినిమా హిట్ కాకపోతే.. తాను మళ్లీ తన ముఖం చూపించనంటూ... కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఎఫ్3 సక్సెస్ మీట్‌కు హాజరయ్యారు.
అయితే ఆయన స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత ... ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వచ్చిన మంజూష .. ఆయనను ఏదో అడిగే ప్రయత్నం చేసింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ ఆమెపై చిరాకు పడుతూ.. ఉండమ్మ నీతోని.. అంటూ విసుగ్గున్నారు. మేం ఏదో మాట్లాడానికి వస్తే.. నువ్వేంటి అంటూ.. ఆమెపై సీరియస్ అయ్యారు. మా గోలే సరిపోదంటే నీ గోల ఒకటి అన్నారు. అంతే ఆమె మొఖం చిన్నబుచ్చుకుంటూ.. స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ ఫేస్బుక్, సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది.
ఇక ఆ తర్వాత... రాజేంద్ర ప్రసాద్ ముఖానికి కర్చీప్ పట్టుకొని వచ్చారు. ముఖానికి కట్టిన కర్చీఫ్ తీస్తూ... ఎఫ్3 సినిమా హిట్ అవ్వకపోతే.. తన ముఖం చూపించనన్నాన్నారు. అయితే ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్నారు రాజేంద్ర ప్రసాద్.45 ఏళ్ల తన సినీ జీవితంలో తనకు నచ్చిందే నచ్చిందని చెప్పానన్నారు.నచ్చనిది నచ్చలేదని చెప్పానని తెలిపారు. ఎఫ్3కు రిలీజ్ రోజున.. మా అందరి సమక్షంలో సినిమా హిట్ అవ్వకపోతే.. నా ముఖం చూపించానని చెప్పానన్నారు. నవ్వు.. ఆడియన్స్ ఉన్నారన్న ధైర్యంతో తాను ఆ మాట అన్నానన్నారు. ఎఫ్3 సినిమాకు అన్నీ చోట్ల సెంటర్స్ ఫుల్ అయ్యాయన్నారు. నవ్వును నమ్ముకొని 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా తనకు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. నవ్వు ఎవర్ గ్రీన్ అంటూ ప్రూవ్ చేసిన మా అబ్బాయి అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అన్నారు రాజేంద్ర ప్రసాద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor manjusha, F3 Movie, Manjusha Anchor, Rajendra Prasad, Tollywood