సాధారణంగా లేటు వయసులో ఘాటు ప్రేమ అని అంటుంటాం. ఇప్పుడు నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అందంతో కట్టి పడేసిన సీనియర్ నటి జయప్రద.. అలాంటి ప్రేమలోనే ఉన్నారట. అయితే రియల్ లైఫ్‌లో కాదండి బాబూ.. రీల్‌లైఫ్‌లో. రాజేంద్రప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘లవ్@60’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. ఓటీటీలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
లాక్‌డౌన్ తర్వాత మూతపడ్డ థియేటర్స్ ఇప్పుడే తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మన దర్శక నిర్మాతలు వారి సినిమాలను ఓటీటీల్లోనే విడుదల చేసుకుంటూ వచ్చారు. అదే కోవలో దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ప్లాన్ చేసి పరిమిత బడ్జెట్‌లో ‘లవ్@60’ సినిమాను రూపొందిస్తున్నాడట. సినిమా చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట. ఆరు పదుల వయసున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుడితే.. అది ఎలా ఉంటుంది. వారి కుటుంబాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఎలాంటి పరిస్థితులు వారిద్దరూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అనే కథాంశంతో వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. త్వరలోనే ఈ వెబ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jaya Prada, Ott, Rajendra Prasad