Rajeev Kanakala- Suma: సుమ షోలో రాజీవ్ భావోద్వేగం.. ఉన్నట్లుండి ఏడ్చేసిన నటుడు

సుమ రాజీవ్ కనకాల

తెలుగు బుల్లితెర‌పై టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల‌లో ప‌లు షోల‌కు వ్యాఖ్య‌తగా చేస్తోన్న విష‌యం తెలిసిందే. అందులో జీ తెలుగులో వ‌చ్చే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఒక‌టి.

 • Share this:
  Rajeev Kanakala- Suma: తెలుగు బుల్లితెర‌పై టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల‌లో ప‌లు షోల‌కు వ్యాఖ్య‌తగా చేస్తోన్న విష‌యం తెలిసిందే. అందులో జీ తెలుగులో వ‌చ్చే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఒక‌టి. సుమతో పాటు ర‌వి కూడా యాంక‌ర్‌గా క‌నిపించే ఈ షోలో వినూత్న టాలెంట్ ఉన్న వారిని ఎంక‌రేజ్ చేస్తుంటారు. ఇక ఈ షోకు వ‌చ్చే సెల‌బ్రిటీలు కంటెస్టెంట్‌ల‌పై బెట్టింగ్ క‌డుతుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ షోలో హిమ‌జ‌, శ్యామ‌ల‌తో పాటు రాజీవ్ క‌న‌కాల పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది. అందులో వ‌చ్చిన ఓ కంటెస్టెంట్ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. వారితోనే పెయింటింగ్ వేయిస్తుంటాడు. ఇలా రాజీవ్ క‌ళ్ల‌కు గంత‌లు కట్టి.. ఆయ‌న తండ్రి దేవ‌దాస్ క‌న‌కాల ఫొటోను గీయిస్తాడు.ఇక క‌ళ్లు తెలిరిచిన త‌రువాత త‌న తండ్రి డ్రాయింగ్‌ని చూసిన రాజీవ్.. భావోద్వేగానికి గుర‌య్యాడు. నాన్న‌ను త‌లుచుకుంటూ షోలో ఏడ్చేశాడు. ఆ స‌మ‌యంలో సుమ కూడా ఏడుస్తుంది. ఇక ఆ ఫొటో వెనకాల ఎన్టీఆర్ డ్రాయింగ్ ఉండ‌గా.. ఒక‌వైపు మా నాన్న‌, ఇంకొక‌రు నా బెస్ట్ ఫ్రెండ్ అని రాజీవ్ అంటాడు.

  ఇక షోలో ప్రారంభంలో సుమ‌, రాజీవ్ ఇద్ద‌రు పాటతో ఎంట్రీ ఇవ్వ‌డం.. వారిద్ద‌రిని చూసి ర‌వి సీతారాముడిలా ఉన్నారంటూ మాట్లాడ‌టం.. దానికి రాజీవ్ క‌న‌కాల రామాయ‌ణంలో సీత త‌క్కువ‌గా మాట్లాడుతుంద‌ని విన్నాను అని సుమ వైపు చూడటం చూపించారు. అలాగే ఈ షోలో రాజీవ్, ర‌వితో క‌లిసి ఫ్రైడ్ రైస్ చేశారు.

  ఇక సుమ గురించి చెబుతూ.. పెళ్లైన కొత్త‌లో ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెబితే.. కేవ‌లం ప‌చ్చి మిర్చిల‌తో చ‌ట్నీ చేసుకొని వ‌చ్చింద‌ని రాజీవ్ గుర్తు చేసుకున్నారు. ఇక ర‌వి.. ఎలా భ‌రిస్తున్నారు బావ అని అడ‌గ్గా.. నువ్వు ఎలా భ‌రిస్తున్నావు అంటూ రాజీవ్ అత‌డికి కౌంటర్ వేశారు. మొత్తానికి కామెడీతో వ‌చ్చిన ఈ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
  Published by:Manjula S
  First published: