హోమ్ /వార్తలు /సినిమా /

Shekar Movie Review : ‘శేఖర్’ మూవీ రివ్యూ .. రాజశేఖర్ మరో హిట్టు అందుకున్నాడా.. ?

Shekar Movie Review : ‘శేఖర్’ మూవీ రివ్యూ .. రాజశేఖర్ మరో హిట్టు అందుకున్నాడా.. ?

శేఖర్ మూవీ మూవీ  రివ్యూ (Twitter/Photo)

శేఖర్ మూవీ మూవీ రివ్యూ (Twitter/Photo)

Shekar Movie Review : రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడ వేగ’ తో మళ్లీ ఫామ్‌లో వచ్చారు. ఆ తర్వాత కల్కితో మరోసారి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. తాజాగా ఈయన తన జీవిత భాగస్వామి జీవిత దర్శకత్వంలో తన పేరులో ఉన్న ’శేఖర్’ టైటిల్‌తో చేసిన ఈ మూవీతో మరో హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...

రివ్యూ : శేఖర్ రివ్యూ                                                                                                            నటీనటులు :  డాక్టర్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్, ప్రకాష్ రాజ్, సమీర్ తదితరులు..

సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ : మల్లికార్జున్ నరగాని                                                                                ప్రొడ్యూసర్స్ : బీరం సుధాకర రెడ్డి, శివానీ రాజశేఖర్,శివాత్మిక రాజశేఖర్,బొగ్గారం వెంకట శ్రీనివాస్                                                                                                                                        దర్శకత్వం : జీవితా రాజశేఖర్

రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడ వేగ’ తో మళ్లీ ఫామ్‌లో వచ్చారు. ఆ తర్వాత కల్కితో మరోసారి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. తాజాగా ఈయన తన జీవిత భాగస్వామి జీవిత దర్శకత్వంలో తన పేరులో ఉన్న ’శేఖర్’ టైటిల్‌తో చేసిన ఈ మూవీతో మరో హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

శేఖర్ (డాక్టర్ రాజశేఖర్) ఓ వాలెంటరీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసినా.. అవసరమైన సందర్భాల్లో డిపార్ట్‌మెంట్ వారికీ కేసు ఇన్వెస్టిగేషన్‌లో సహాయ పడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఈయన మాజీ భర్య అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణిస్తోంది. తన భార్య మరణంపై శేఖర్‌కు కొన్ని అనుమానులు ఉంటాయి. అంతకు ముందు అతని కూతురు (శివానీ రాజశేఖర్) ఇలానే అనుకోకుండా యాక్సిడెంట్‌లో చనిపోతోంది. ఇక వీళ్లిద్దరు ప్రమాదవశాత్తు చనిపోవడంలో ఒక మిస్టరీ ఉంటోంది. దాన్ని హీరో ఎలా సాల్వ్ చేసాడనేదే ‘శేఖర్’ మూవీ స్టోరీ

కథనం..

జీవితా రాజశేఖర్.. శేఖర్ మూవీ కథను మనం ఇప్పటికే చాల ా సినిమాల్లో చూసి ఆర్గనైజైడ్ మెడికల్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. అనుకున్న కథను తనదైన శైలిలో తెరకెక్కించడంలో కాస్త తడబడ్డారనే చెప్పాలి.  సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో హీరోను  ఉత్తమముడనే  కోణంలో సాగుతోంది.  సినిమా స్టార్టింగ్‌లో హీరో ఓ కేసు ఇన్వెస్టిగేషన్  ఎలా సాల్వ్ చేసాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించి సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేయడంలో జీవిత సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత అదే టెంపో చివరకు కంటిన్యూ చేయలేకపోయారు. సినిమాలో ఫస్ట్ కేసు సాల్వ్ చేసిన తర్వాత  ఇంటర్వెల్ వరకు  హీరో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్, కూతురుతో ఫ్లాష్ బ్యాక్ ఏదో చకా చకా కానీయకుండా సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.  ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ సీన్‌ వరకు ఒకటే కేసును హీరో ఎలా ఛేధించాడనే ఈ సినిమా స్టోరీ. దాన్ని మరింత ఆసక్తికంగా మలిచి తెరకెక్కించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఈ సినిమా మొత్తం సీరియర్, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగడంతో కామన్ ఆడియన్స్ కోరుకునే హాస్యం, ఫైట్స్ మిస్ అయ్యాయనే ఫీలింగ ఉంది. ఈ సినిమా ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

రాజశేఖర్‌కు ఇలాంటి సీరియస్ పోలీస్ రోల్స్ ఆయనకు కొట్టిన పిండే. మరోసారి తనదైన శైలిలో ఈ వయసులో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషన్ సీన్స్‌లో రాజశేఖర్ నటన బాగుంది. సినిమా స్టార్టింగ్‌లో ఓ కేసును ఛేదించే క్రమంలో రాజశేఖర్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత కేమియో రోల్లో నటించిన రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో నటించిన సమీర్, అభినవ్ గోతమ్ తమ పాత్ర పరిధిమేరకు నటించారు. క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ లాయర్‌గా ఆకట్టుకున్నారు. మిగతా నటీనటుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్స్ పేరుకే కానీ.. పెద్దగా నటించే స్కోపు వారికి లభించలేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్.. 

కథ

రాజశేఖర్ నటన

సెకండాఫ్

మైనస్ పాయింట్స్ 

బోరింగ్‌గా సాగే కథనం

ట్విస్ట్‌‌లు లేకపోవడం

పాటలు

చివరి మాట : ఎమోషనల్‌గా సాగే యాక్షన్ థ్రిల్లర్

రేటింగ్ : 2.5 /5

First published:

Tags: Dr Rajashekar, Jeevitha rajashekar, Shekar Movie, Shivani Rajashekar, Tollywood

ఉత్తమ కథలు