Jeevitha Rajashekar : జీవిత రాజశేఖర్.. రాజశేఖర్ సతీమణిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చూపెస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈమె దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాజశేఖర్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు తన ఏజ్‌కు తగ్గ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమ ా కోసం జీవితా రాజశేఖర్.. ఏ. పార్ధసారథి రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారు. సినిమా విడుదల సందర్భంగా సదరు డబ్బు తిరిగి చెల్లిస్తామని మాట ఇచ్చారట. తీరా సినిమా విడుదల నేపథ్యంలో తనకు రావాల్సిన బాకీ డబ్బులు జీవితా రాజశేఖర్ చెల్లించకపోవడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ను ఆశ్రయించగా.. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ వారు 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని ఆదేశించారు. లేకుంటే ‘శేఖర్’ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను తదుపరి ఉత్తర్వులు వెలుబడే వరకు అటాచ్‌మెంట్ చేయమని ఆదేశించారు.
హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్‌చాందిని హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాజశేఖర్ లుక్‌తో పాటు నటన బాగుంది. ఆమె కూతురుగా శివానీ యాక్ట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 60 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం.
Sarkaru Vaari Paata 8 Days WW Collections : సర్కారి వారి పాట 8 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది.కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరోవైపు రాజశేఖర్ కిరణ్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్ధమవుతుంది.రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dr Rajashekar, Jeevitha rajashekar, Shekar Movie, Tollywood