Home /News /movies /

RAJASHEKAR SENSATIONAL COMMENTS ON SENIOR TOP HERO MOHAN BABU WHY HE NOT ACTED WITH SUPER HIT HANUMAN JUNCTION MOVIE TA

RajaShekar : మోహన్ బాబుతో ఆ కారణంగానే ఆ బ్లాక్ బస్టర్ మూవీ చేయలేదన్న రాజశేఖర్.. ఆలీతో టాక్ షోలో యాంగ్రీ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..

మోహన్‌బాబు, రాజశేఖర్ (Twitter/Photo)

మోహన్‌బాబు, రాజశేఖర్ (Twitter/Photo)

RajaShekar : రాజశేఖర్.. యాంగ్రీ మ్యాన్‌గా ఒకప్పడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. .35 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో.. తలంబ్రాలు, అంకుశం, ఆవేశం,  ఆహుతి లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈయన ఆలీతో టాక్‌ షోలో తన జీవిత భాగస్వామి జీవితతో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇంకా చదవండి ...
    RajaShekar : రాజశేఖర్.. యాంగ్రీ మ్యాన్‌గా ఒకప్పడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. 35 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో.. తలంబ్రాలు, అంకుశం, ఆవేశం,  ఆహుతి లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు తెలుగులో భారీ పారితోషికం అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. చిరంజీవి, బాలకృష్ణ  లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి. అన్న, అల్లరి ప్రియుడు లాంటి ఎన్నో సంచలన సినిమాల్లో నటించారు రాజశేఖర్. మిలినియం మొదట్లో కూడా మనసున్న మారాజు, మా అన్నయ్య లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే ఓ దశలో రాజశేఖర్‌కు వరస ఫ్లాపులు వచ్చాయి. కనీసం ఆయన సినిమాలు వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు.

    సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక కథానాయకుడిగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు రాజశేఖర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. రీసెంట్‌గా ఈయన హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీతో పలకరించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు కూడా నటించింది. ఈ సినిమాలో వీళ్లిద్దరు నిజ జీవిత పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఆలీతో షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    Khaidi No 150 : ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’.. మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..


    ఈ సందర్భంగా ‘హనుమాన్ జంక్షన్’ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసారో ఈ షోలో వెల్లడించారు. ఎడిటర్ మోహన్ తన తనయుడు ఎం.రాజా దర్శకత్వంలో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాను అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సినిమాలో రాజశేఖర్, మోహన్ బాబులను హీరోలుగా అనుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. ఈ సందర్భంగా రాజశేఖర్.. ఎడిటర్ మోహన్ దగ్గరకు వెళ్లి మోహన్ బాబుతో సమయపాలన అంటూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆయన ఉదయం 7 గంటలకే మేకప్‌తో లొకేషన్‌లో ఉంటారు. నేను 10 గంటల తర్వాత షూటింగ్‌కు వస్తాను.

    Dr RajaShekar - Shekar : రాజశేఖర్ ‘శేఖర్’ మూవీలో శివానీ రాజశేఖర్.. ఒకే సినిమాలో తండ్రి కూతుళ్లు..


    ఈ సందర్భంగా మా మధ్య ఏదైనా గొడవ జరిగితే.. మీకు ప్రాబ్లెమ్ అవుతుందని సున్నితంగా ఆ ప్రాజెక్ట్ తిరస్కరించినట్టు రాజశేఖర్ చెప్పుకొచ్చారు. మోహన్ బాబుతో షూటింగ్ టైమ్ విషయం తప్పించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా మధ్య మంచి స్నేహ వాతావరణం ఉందన్నారు. అదే సందర్భంలో హీరోయిన్ జీవితను మార్చమని నిర్మాతలను కోరితే.. నిర్మాతలు తననే మార్చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక విలన్ నుంచి హీరోగా మారిన నేను.. మళ్లీ ఛాన్స్ వస్తే.. విలన్‌గా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mohan Babu, Rajashekar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు