హోమ్ /వార్తలు /సినిమా /

రాజశేఖర్‌కు బాలకృష్ణ బంపర్ ఆఫర్... దశ తిరిగినట్టే...

రాజశేఖర్‌కు బాలకృష్ణ బంపర్ ఆఫర్... దశ తిరిగినట్టే...

గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన సీనియర్ నటుడు జగపతిబాబు... ఆ తరువాత విలన్‌గా ఫుల్ బిజీ అయిన సంగతి తెలిసిందే.

  యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఒకప్పుడు టాలీవుడ్‌లో అనేక హిట్స్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్... పాత్ర నచ్చితే విలన్‌గా నటించేందుకు కూడా రెడీగానే ఉన్నానని గతంలో ప్రకటించారు. అప్పట్లో ఆయన చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో విలన్‌గా నటించడం ఖాయమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాజశేఖర్ మాత్రం ఇంకా హీరోగానే కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా ఆయన విలన్‌గా ఎంట్రీ ఇచ్చే సమయం దగ్గరకొచ్చిందనే టాక్ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించేందుకు కమిటయ్యారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  ఇటీవల రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్‌కు రాజశేఖర్ హాజరుకావడం వెనుక కారణం కూడా ఇదేనని ఫిల్మ్ సర్కిల్స్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ నటిస్తారని వార్తలు వచ్చాయి. శ్రీకాంత్ పేరు కూడా పరిశీలనలో ఉందని టాక్ వినిపించింది. అయితే వీరికంటే రాజశేఖర్ విలన్‌గా నటిస్తే... సినిమాకు మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావించిన బాలకృష్ణ, బోయపాటి... ఇందుకోసం రాజశేఖర్‌ను ఒప్పించారని సమాచారం.

  జగపతి బాబు (ఫైల్ ఫోటో)

  గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన సీనియర్ నటుడు జగపతిబాబు... ఆ తరువాత విలన్‌గా ఫుల్ బిజీ అయిన సంగతి తెలిసిందే. లెజెండ్ తరువాత విలన్‌గా జగపతిబాబు రేంజ్ బాగా పెరిగిపోయింది. జగపతిబాబు విలన్‌గా ఆ స్థాయిలో రాణిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే దర్శకుడు బోయపాటి జగపతిబాబును పవర్‌ఫుల్ విలన్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బాలకృష్ణ కొత్త సినిమాలో రాజశేఖర్‌ను సైతం బోయపాటి అదే స్థాయిలో విలన్‌గా చూపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, Rajashekar

  ఉత్తమ కథలు